మొదటి రోజు మెరిసిన వెంకీమామ

రియల్ లైఫ్ మామ-అల్లుడు వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటించిన వెంకీమామ సినిమాకు తొలి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. సినిమాపై భారీ అంచనాలు ఉండడం, మార్కెట్లో మరో పెద్ద సినిమా పోటీలో లేకపోవడం వెంకీమామకు కలిసొచ్చింది. అలా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు 6 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అటు నాగచైతన్య, ఇటు వెంకటేష్ కెరీర్స్ లో మొదటి రోజు వసూళ్లలో ఇదే బెస్ట్. ఇప్పటివరకు నాగచైతన్య కెరీర్ లో శైలజారెడ్డి అల్లుడు, వెంకీ కి బాబు బంగారం సినిమాలు సోలోగా బిగ్గెస్ట్ ఓపెనర్స్. ఆ సినిమాల్ని వెంకీమామ క్రాస్ చేసింది.

వీకెండ్ కావడంతో ఈరోజు, రేపు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అనే సంగతి సోమవారం నాటి వసూళ్లతో తేలిపోతుంది. ఎందుకంటే, సినిమాపై ఇప్పటికే నెగెటివ్ టాక్ మొదలైంది. పాతికేళ్ల కిందటి కథ-స్క్రీన్ ప్లేతో సినిమా తీశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వెంకీమామ పరిస్థితేంటనేది ఆసక్తికరంగా మారింది.

మొదటి రోజు షేర్స్
నైజాం - రూ. 2.37 కోట్లు
సీడెడ్ - రూ. 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 0.88 కోట్లు
ఈస్ట్ - రూ. 0.60 కోట్లు
వెస్ట్ - రూ. 0.30 కోట్లు
గుంటూరు - రూ. 0.37 కోట్లు
నెల్లూరు - రూ. 0.27 కోట్లు
కృష్ణా - రూ. 0.37 కోట్ల

Show comments