లోక్ సభ స్పీకర్ ఆయనే, డిప్యూటీ స్పీకర్ ఏ పార్టీకి?

లోక్ సభ స్పీకర్ గా మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ వీరంద్రకుమార్ నియామకం ఖరారు అయినట్టే అని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ పార్టీ ఫిక్స్ అయ్యిందని, దళితనేత అయిన ఆయనను లోక్ సభ స్పీకర్ గా ఎన్నిక చేసేందుకు బీజేపీ నిర్ణయించిందని తెలుస్తోంది. లోక్ సభలో బలాబలాల లెక్కల ప్రకారం ఎలాగూ బీజేపీ అనుకున్న వాళ్లే స్పీకర్  గా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంది.

ముందుగా మేనకాగాంధీకి లోక్ సభ స్పీకర్ పదవిని ఇవ్వాలని బీజేపీ అనుకుందట. అయితే అందుకు ఆమె నిరాకరించారని సమాచారం. కేంద్రమంత్రిగా మేనకకు ఈసారి మోడీ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె స్పీకర్ పదవిని తీసుకోవడానికి కూడా నో చెప్పిందట. దీంతో ఆ అవకాశం వీరేంద్రకుమార్ కు దక్కనుందని సమాచారం.

ఆయన ఏడోసారి ఎంపీగా నెగ్గారట. ప్రొటెం స్పీకర్ గా కూడా ఆయనే వ్యవహరించనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం మరింత ఆసక్తిదాయకంగా మారింది. ఆ అవకాశం సాధారణంగా ప్రతిపక్షం వాళ్లకు దక్కుతూ ఉంటుంది. అయితే కాంగ్రెస్ కు ఆ అవకాశం ఇవ్వడంలేదు బీజేపీ. క్రితంసారి అన్నాడీఎంకే వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీకి లోక్ సభలో ఉన్నదే ఒక ఎంపీ.

ఇలాంటి నేపథ్యంలో మరో పార్టీకి అవకాశం ఇవ్వనుందట కమలం పార్టీ. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని శివసేన కోరుతోంది. అయితే ఆ అవకాశం బీజేడీకి దక్కవచ్చని సమాచారం. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఈ విషయంలో వినిపిస్తోంది!

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?