పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదన్న హీరో కూతురు!

పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని మరోసారి స్పష్టం చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళనాట హీరోయిన్ గా కొనసాగుతున్న శరత్ కుమార్ కూతురు ఈ ప్రకటనతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. హీరోయిన్ గా వివిధ సినిమాల్లో నటిస్తూ సక్సెస్ కోసం ఈమె ఎదురుచూస్తూ ఉంది. అయితే మధ్యలో వివిధ అంశాలపై కామెంట్స్ చేస్తూ ఉంది.

గతంలో నటుడు విశాల్ తో చాలా సన్నిహితంగా మెలిగింది వరలక్ష్మి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ వర్సెస్ శరత్ కుమార్ ల యుద్ధమే సాగింది. ఆ సమయంలో కూడా వీరు కలహించుకోలేదు కానీ, ఆ తర్వాత పూర్తిగా దూరం అయ్యారు.

ఆ తర్వాత పలుసార్లు విశాల్ ను ఈమె విమర్శించింది. మరోవైపు విశాల్ పెళ్లికి రెడీ అయిపోయాడు. నిశ్చితార్థం కూడా జరిగినట్టుంది. అయితే వరలక్ష్మి మాత్రం పెళ్లి ప్రసక్తి తన జీవితంలో లేదని అంటోంది. పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేస్తోంది.

సినీ ఇండస్ట్రీలో చాలామంది పెళ్లి ప్రస్తావన తేగానే.. అప్పుడేనా అంటుంటారు. అయితే శరత్ కుమార్ కూతురు మాత్రం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కొంచెం చిన్న వయసులోనే ప్రకటించేసింది. ఆ ప్రకటనకు తను కట్టుబడి ఉంటానంటోంది!

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!