హీరోయిన్ కు రాజకీయం అంటే ఏమిటో అర్థమైంది!

రాజకీయం అంటే సినిమాల్లో నటించినంత సులభంకాదని, పాట అయిపోయేలోగా అద్భుతాలు జరిగేది సినిమాలో మాత్రమే అని.. అర్థం అయినట్టుగా ఉంది ఊర్మిలకు. ఎన్నికల ముందు రాజకీయ రంగేసుకున్న ఊర్మిల ఇప్పుడు వాటి నుంచి నిష్క్రమిస్తున్నట్టుగా ప్రకటించింది. సెలబ్రిటీలు ఎంపీలుగా నెగ్గడానికి అవకాశం ఉన్న ముంబైలోని ఒక ఎంపీ సీటు నుంచి ఊర్మిల పోటీచేసిన సంగతి తెలిసిందే.

గతంలో బాలీవుడ్ నటుడు గోవిందా ఎంపీగా నెగ్గిన సీటు అది. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఊర్మిలను పోటీ చేయించింది. దీంతో ఆమె విజయం ఖాయమన్నట్టుగా ప్రచారం చేశారు. అయితే ఏకంగా నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఊర్మిల ఓడిపోయింది.

రంగు రంగుల గ్లామరస్ జీవితాన్ని గడిపే హీరోయిన్లు.. రాజకీయాలను కూడా గ్లామరస్ గా భావించేవస్తారు. వీటిల్లో గెలిస్తే వాళ్లకు ఓకే, ఓడినప్పుడే చాలా కఠినంగా అనిపిస్తాయి పరిస్థితులు. ఊర్మిలకు కూడా అదే అనుభవంలోకి వచ్చినట్టుగా ఉంది. అందుకే తను కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. రాజీనామాను ఇచ్చేసింది.

తన ఓటమికి స్థానిక కాంగ్రెస్ నేతలే కారణమంటూ, పార్టీ ఫండ్ కూడా సరిగా ఇవ్వలేదంటూ ఊర్మిల ఇటీవలే అధిష్టానానికి లేఖ రాసిందట. ఆ లేఖ బయటపడటంతో ఊర్మిలకు మరింత కోపం వచ్చిందట. దీంతోనే ఆమె రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇంతటితో ఈ నటీమణి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటుందో లేక ఏ శివసేనలోనో, బీజేపీలోనో చేరుతుందో!

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!

Related Stories: