ఇద్దరు ఇండిపెండెంట్లు.. ఎంపీలు అవుతారా?

ఇండిపెండెంట్ గా ఎంపీగా నెగ్గడం అంటే మాటలు కాదు. ఆ కాలం పోయిందనే అంటారు ఎవరైనా. ఎమ్మెల్యేలుగా అయినా ఇండిపెండెంట్ గా నెగ్గడం సాధ్యమేమో కానీ ఇండిపెండెంట్ గా ఎంపీగా నెగ్గడం అంటే అది చాలా కష్టమనే అభిప్రాయాలే ఉన్నాయి.

గత కొన్నేళ్లలో ఇండిపెండెంట్ ఎంపీలుగా ఎన్నికైన వారి శాతం చాలా చాలా తక్కువ. దీంతో అది అసాధ్యం అనే అభిప్రాయం ఏర్పడిపోయింది. అయితే ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ఏమైనా జరగొచ్చు! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన తీరును గుర్తు చేస్తే.. ప్రజాస్వామ్యంలో రాజకీయం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరని అనాలి.

ఇలాంటి నేఫథ్యంలో ఈసారి ఇద్దరు ఆసక్తిదాయకమైన వ్యక్తులు ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నారు. వారు దక్షిణాది అంతా పేరున్న నటులు. సొంత భాషతో పాటు దక్షిణాదిలోని ఇతర భాషల్లో తమ ప్రతిభను చూపినవారు, ప్రత్యేకతను చాటినవారు. వారే మండ్య ఎంపీ సీటుకు పోటీలో ఉన్న సుమలత, బెంగళూరు సెంట్రల్ ఎంపీ సీటు నుంచి పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్. వీరిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు.

వీరికి ప్రధాన పార్టీలు టికెట్ ను ఆఫర్ చేసే పరిస్థితి ఉన్నా.. వీరు స్వతంత్రులుగానే బరిలోకి దిగారు. సుమలతకు టికెట్ ఇవ్వడానికి బీజేపీ ముందుకు వచ్చింది. అయితే ఆమె మద్దతు మాత్రమే తీసుకుంది. ప్రకాష్ రాజ్ కు ఆప్ టికెట్ ఇచ్చేదే అయితే ఆయన స్వతంత్రుడిగా బరిలోకి దిగారు.

ప్రకాష్ రాజ్ కు 'ఈల' గుర్తు వచ్చింది. సుమలతకు 'వంగిన బూర ఊదే వ్యక్తి' గుర్తు వచ్చింది. మరి దక్షిణాదినంతా పేరున్న ఇద్దరు నటులు ఒకేసారి ఒకే రాష్ట్రం నుంచి ఇండిపెండెంట్స్ గా ఉండటం యాదృచ్చికమే. మరి వీరిద్దరూ గెలిచి లోక్ సభ లోకి ఎంటరైతే.. మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది!

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా? 

Show comments