టీవీ 36 ఎవరి మద్దతుతో..?

టీవీ9 మాజీ సిఇఓ రవిప్రకాష్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆయన టీవీ 36 అనే కొత్త ఛానెల్ పెడుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు ఓ లోగో కూడా బయటకు వచ్చింది. అయితే ఈటీవీ 36 అన్నది ఒకప్పటి టీవీ 9 జర్నలిస్ట్ జకీర్ తన ఫేస్ బుక్ పేజ్ కు పెట్టుకున్న పేరా? లేకా కొత్త ఛానెల్ పేరా అన్నది కాస్త క్లారిటీ తక్కువగానే వుంది.

ఒకప్పటి టీవీ 9 జర్నలిస్ట్ జకీర్ ఫేస్ బుక్ లైవ్ పెడుతూ ఈ ఛానెల్ గురించి ఆయన స్వంత అభిప్రాయాలు, వినవస్తున్న వార్తలు, అన్నట్లుగా ఈ లైవ్ లో సుదీర్ఘంగా మాట్లాడారు. కానీ, ఇవన్నీ వింటే, రవిప్రకాష్ తో జకీర్ టచ్ లో వున్నారనో, లేదా రవిప్రకాష్ మాట మేరకే ఆయన ఈ లైవ్ లోకి వచ్చి ఈ విశేషాలు అన్నీ చెప్పారని భావించాల్సి వస్తోంది.

ఛానెల్ ఎలా వుండబోతొంది, రవిప్రకాష్ ఆలోచనలు, కార్యాచరణ ఎలావున్నాయి, ఇవన్నీ జకీర్ తనకు అందిన సమాచారం అన్నట్లుగా వెల్లడించారు. జకీర్ తనమాటల్లో ఓ మాట కూడా అన్నారు. భాజపా తెలంగాణలో అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తోంది. అందువల్ల రవిప్రకాష్ భాజపా మద్దతుతో ఛానెల్ పెడుతున్నారా? లేక రవిప్రకాష్ తన మద్దతును భాజపాకు అందిస్తారా? అన్న పాయింట్ ను ఆయన లేవనెత్తారు.

ఏమైతేనేం తెలంగాణలో ఓ ఇండిపెండెంట్ మీడియా అవసరం అనే పేరుతో, యాంటీ కేసిఆర్ లేదా యాంటీ టీఆర్ఎస్ మీడియా సంస్థను తేవాలన్న ఆలోచన వున్నట్లు కనిపిస్తోంది. జకీర్ మాటలను బట్టి, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి తదితరులు ఓ పత్రిక తేవాలన్న ఆలోచన కూడా చేస్తున్నారని అర్థం అవుతోంది.

మొత్తంమీద పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఎవడి డప్పు వాడు కొట్టుకోవాల్సిందేనేమో?

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి