మహేష్ ఆయుధం మార్చాడు.. పోజు కాదు

దసరా వచ్చేసింది. లుక్స్ హంగామా మొదలైంది. సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మహేష్ గొడ్డలి పట్టుకున్న పోజు వచ్చేసింది. బాలయ్య కూడా కత్తిపట్టిన స్టిల్ రిలీజ్ చేశాడు. ఇక బన్నీ తన కొత్త సినిమా నుంచి మాస్ లుక్ రిలీజ్ చేశాడు. ఇలా చాలామంది హీరోలు పోస్టర్లతో హంగామా చేస్తున్నారు. అయితే ఒక్క మహేష్ మాత్రమే ట్రోలింగ్ కు గురవుతున్నాడు. అతడికి సంబంధించిన తాజా స్టిల్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మహేష్ కొత్త స్టిల్ వచ్చింది. ఫిలింసిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్ ముందు మహేష్ గొడ్డలితో నిల్చున్న పోజు ఇది. ఈ ఫొటోతో ఘట్టమనేని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మహేష్ మాస్ లుక్ అంటూ తెగ హంగామా చేశారు. కానీ సోషల్ మీడియా మాత్రం దీనికి భిన్నంగా రియాక్ట్ అయింది. మహేష్ డ్రెస్, పట్టుకున్న ఆయుధం మాత్రమే మారిందని.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ సాక్ష్యాలతో సహా బయటపెట్టడం స్టార్ట్ చేశారు.

భరత్ అనే నేను సినిమాలో మహేష్ కత్తి పట్టుకుంటాడు. ఇక మహర్షిలో ఓ ఫైట్ సీన్ లో ఏదో చిన్న ఆయుధం పట్టుకుంటాడు మహేష్. ఇక శ్రీమంతుడు సినిమాలో కూడా రాడ్ లాంటిది పట్టుకుంటాడు. ఇలా ఎన్ని వెపన్స్ మార్చినా మహేష్ నిల్చునే పోజు, అతడు చూసే విధానం మాత్రం మారడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు చాలామంది. ఇంకొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి.. కొండారెడ్డి బురుజు ముందు మహేష్ ఉన్న స్టిల్ ను తీసేసి, భరత్ అనే నేనులో మహేష్ స్టిల్ ను పెట్టి మార్ఫింగ్ చేస్తున్నారు. అస్సలు తేడా లేదంటూ పోస్టులు పెడుతున్నారు.

మహేష్, అనీల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ వైపు ఎంతలా అంచనాలు పెరుగుతున్నాయో, మరోవైపు అదే స్థాయిలో విమర్శలు కూడా పడుతున్నాయి. మహేష్ తో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేయొద్దంటూ అనీల్ రావిపూడికి సలహాలు ఇస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ కామెడీ చేసిన ప్రతిసారి మహేష్ ఫెయిల్ అయ్యాడని, కాబట్టి కంటెంట్ తో సినిమా చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు దీనికి తోడు ఈ పోస్టర్ ట్రోలింగ్ ఒకటి. 

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం