'అరవింద' క్లైమాక్స్ పై త్రివిక్రమ్ రియాక్షన్

భారీ యాక్షన్ సీన్. హై-ఓల్టేజ్ యాక్షన్. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఎలివేషన్. విలన్ గొంతులో హీరో మొండికత్తిని దించేస్తాడు. సినిమా ఓపెనింగ్ లోనే ఇంత యాక్షన్ ఉంటే, ఇక క్లయిమాక్స్ ఫైట్ అదిరిపోతుందని అంతా ఆశించారు. కానీ అరవింద సమేత క్లైమాక్స్ లో ఫైట్ లేదు. ఈ లోటు ప్రేక్షకుల్ని నిరాశపరచలేదు. అయినప్పటికీ దీనిపై త్రివిక్రమ్ స్పందించాడు. 

"మేం ముందు యాక్షన్ క్లైమాక్స్ అనుకున్నాం. దాన్ని డిజైన్ కూడా చేశాం. దానిపై కూర్చొని మాట్లాడుకున్నాం కూడా. అయితే మొత్తం డిస్కషన్ లో అసలు క్లైమాక్స్ ఫైట్ వద్దని చెప్పింది ఫైట్ మాస్టర్లు. ఫైట్ కంటే కూడా డైలాగ్స్ తో వెళ్లడమే కరెక్ట్ అని వాళ్లు చెప్పారు. ఈ విషయంలో రామ్-లక్ష్మణ్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి."

ఇలా క్లైమాక్స్ పై క్లారిటీ ఇచ్చాడు త్రివిక్రమ్. రామ్-లక్ష్మణ్ చెప్పిన ఐడియా వల్ల, ఫైట్ డిజైనింగ్ పూర్తయిన తర్వాత కూడా దాన్ని పక్కనపెట్టామని అంటున్నాడు. అరవింద సమేత లాంటి కథకు ఫైట్ లేకుండా క్లైమాక్స్ ఉండడమే కరెక్ట్ అంటున్నాడు.

"సాయంత్రం 6.30కి రామోజీ ఫిలింసిటీలో సిట్టింగ్ స్టార్ట్ చేశాం. చర్చిస్తూనే ఉన్నాం. రాత్రి 2.30 అయిపోయింది. శత్రు, బ్రహ్మాజీని షూటింగ్ కూడా లేకుండా కూర్చోబెట్టాను. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆ చర్చ నడిచింది. చివరికి రామ్-లక్ష్మణ్ చెప్పినట్టు వెర్బల్ (డైలాగ్స్) గానే వెళ్లాలని నిర్ణయించుకున్నాం."

నిన్న థియేటర్లలోకి వచ్చిన అరవింద సమేత సినిమాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. దర్శకుడిగా త్రివిక్రమ్ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా త్రివిక్రమ్ డైలాగ్స్, తారక్ మెస్మరైజింగ్ యాక్టింగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Show comments