త్రివిక్రమ్ కు గేలం వేస్తున్న మహేష్

త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ అన్నది చిరకాలంగా పెండింగ్ లో వుంది. ఖలేజా తరువాత మళ్లీ ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. ఇంతలో ఇద్దరి మధ్య అనుకోకుండానే గ్యాప్ పెరిగిపోయింది. ఇచ్చిన అడ్వాన్స్ నే హారిక హాసిని వెనక్కు తీసుకోవడం, మహేష్ హర్ట్ అయ్యాడని వార్తలు రావడం, త్రివిక్రమ్ తో ఇక సినిమానే వుండదని వినిపించింది.

ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమా చేసే ఆలోచనలో లేరని తెలుస్తోంది. అయితే అంతకు ముందు ఒప్పుకున్న ప్రకారం కొన్ని ప్రకటనలు చేసారు. అంతే. ఆ తరువాత మరిలేదు. ఇదిలావుంటే ఇప్పుడు వున్నట్లుండి త్రివిక్రమ్ మళ్లీ మహేష్ తో కలిసి ఓ ప్రకటన తయారుచేసారు.

ఓ వెబ్ అప్లికేషన్ కు సంబంధిచిన ప్రకటన అది. ఇక్కడే గమ్మత్తయిన విషయం వుంది. ఆ ప్రకటన కోసం మహేష్ ను ఆ వెబ్ అప్లికేషన్ సంస్థ సంప్రదించింది. కానీ వాళ్లు ఫలానా డైరక్టర్ అని అనుకోలేదు. కానీ మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్ పేరు సూచించినట్లు బోగట్టా.

ఆ తరువాత మహేష్ భార్య నమ్రత స్వయంగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి, ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కాల్ రావడంతో త్రివిక్రమ్ కాస్త ఆశ్చర్యపోయినట్లు బోగట్టా. ప్రస్తుతం మహేష్ కు డైరక్టర్ల అవసరం చాలా వుంది. సుకుమార్ ప్రాజెక్టు పట్టాలెక్కేదాకా అనుమానమే.

అనిల్ రావిపూడి తరువాత సినిమా లేదు. వంగా సందీప్ రెడ్డి సినిమా కూడా డవుటే. అందుకే ఇప్పటి నుంచి తానే ఓ మెట్టు దిగి త్రివిక్రమ్ ను లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుంది అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను

Show comments