త్రివిక్రమ్ బర్త్ డే కి..

ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్న పండగ సినిమా 'అల వైకుంఠపురములో' టీజర్ విడుదల విషయంలో కూడా అదే జోష్ చూపించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా నవంబర్ 7న సినిమా టీజర్ విడుదల చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచనలు సాగుతున్నాయి. టూ ఎర్లీ అవుతుందా? కాదా? అన్న ఆలోచన వుంది. అదికాస్తా ఫైనల్ అయితే టీజర్ నవంబర్ 7న వచ్చే అవకాశం వుంది.

ఇప్పటికే ఓ పాట, మరో పాట టీజర్ బయటకు వదిలారు. ఇంకో రోజులో రెండోపాట పూర్తిగా బయటకు వస్తుంది. ఇవన్నీ వచ్చాయి కనుక, టీజర్ ను ఆపుదామా? లేదా ఇచ్చేద్దామా? అన్న ఆలోచనలు సాగుతున్నట్లు బోగట్టా. ఇదిలావుంటే పండగకు వచ్చే మరో సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.

అనిల్ రావిపూడి డైరక్షన్ లోని ఈ సినిమా మాత్రం ఇప్పటి నుంచి సినిమా ప్రచారం విషయంలో తొందరపడడం లేదు. డిసెంబర్ వరకు పాటలు, టీజర్లు ఇలాంటివి ఏవీ వదిలే ఆలోచన చేయడం లేదు. దీపావళికి కూడా పోస్టర్లతో సరిపెడుతోంది.

విజయశాంతి, మహేష్ బాబుల పోస్టర్లు వస్తాయి. ఇప్పటి నుంచి ప్రచారం టూ ఎర్లీ అని, డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసే పక్కాగా వుంటుంది అన్నది సరిలేరు టీమ్ ఆలోచన. దీనికే పక్కాగా కట్టుబడి వెళ్తోంది ఆ సినిమా యూనిట్.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే