ట్రయిలర్ నా? స్పాయిలర్ నా?

ఓ సినిమాకు ట్రయిలర్ వదిలారు అంటే అది ఆ సినిమాకు ఉపయోగపడాలి. ఆ సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని కలిగించాలి. ఆసక్తి పెంచాలి. అలా కాకుండా, ఈ సినిమాలో వుండేది ఇదే. చూపించేది ఇదే అన్నట్లు వుంటే సమస్య కావచ్చు. ఈరోజు విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 ట్రయిలర్ చూస్తే ఇలాగే అనిపిస్తుంది.

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 మహానాయకుడు సినిమా మొత్తం పాలిటిక్స్ తో వుంటుంది. ఆ సంగతి ముందే తెలుసు. పార్ట్ వన్  సినిమాల మీద, పార్ట్ 2 రాజకీయాల మీద అని ముందే మేకర్స్ చెప్పేసారు. అందువల్ల ట్రయిలర్ లో కూడా అదే వుంటుంది అన్న సంగతి ఊహించేదే.

అయితే ఆ పొలిటికల్ కంటెంట్ ఉపయోగించుకుని, ట్రయిలర్ ను ఏ విధంగా కట్ చేయాలన్నదే పాయింట్. దానికి రెండే అవకాశాలు. ఒకటి వీలయినంత వైవిధ్యంగానో లేదా, ఆర్టిస్టిక్ గానో ట్రయిలర్ ను స్మూత్ గా ప్రెజెంట్ చేయడం. యాత్ర ట్రయిలర్ విషయంలో జరిగింది అదే. లేదా కంటెంట్ వుంటే, రెగ్యులర్ ఫార్మాట్ లో కట్ చేసుకుంటూ వెళ్లి చివర్న ఓ మాంచి డైలాగ్ తో, ఓ మాంచి సీన్ తో ఎండ్ చేయడం.

కానీ ఈ ట్రయిలర్ విషయంలో అలా చేయలేదు. సినిమా ఏ విధంగా సీన్ తరువాత సీన్ వస్తుందో, అందులోంచి ప్రతి ముక్క శాంపిల్ గా తీసి, జోడించి వదిలినట్లు వదిలారు. ట్రయిలర్ పొలిటికల్ కనుక, ఫోర్స్ గా వుండాలన్న ఉద్దేశంతో కీరవాణి ఫోర్స్ గా బీజీఎమ్ జోడించారు. ఆ సీన్లు, ఈ బీజీఎమ్ అంతగా సింక్ కాలేదు.

అదీకాక, బాలయ్యను కాషాయంలో, పొలిటికల్ గెటప్ లో ఫస్ట్ పార్ట్ టైమ్ పబ్లిసిటీలోనే చూపించేసారు. అందువల్ల ట్రయిలర్ లో కొత్తగా, ఆసక్తిగా ఏమీ అనిపించలేదు. దాంతో టోటల్ గా ట్రయిలర్ ఇంపాక్ట్ అన్నదే లేకుండా పోయింది.

Show comments