హీరోలను నిద్రలేపిన సంపూర్ణేష్

డబ్బులు చేతినిండా వున్నవాడు దానం చేస్తే గొప్ప కాదు. డబ్బులు కటకటగా వున్నవాడు దానం చేస్తే గొప్ప. సంపూర్ణేష్ బాబు ఆ విధంగా హీరో అనిపించుకున్నాడు. కేరళ అంటే ఉరకలు పరుగులు పెట్టిన మన హీరోలకు శ్రీకాకుళం అంటే స్పందన కలగలేదు.

అలాంటి టైమ్ లో తెలంగాణకు చెందిన సంపూర్ణేష్ బాబు ముందుకు వచ్చి 50వేలు విరాళం ఇవ్వడం అంటే ఏ విధంగా మెచ్చుకోవాలి? పోనీ చేతినిండా సినిమాలు వున్నాయా? కోట్ల పారితోషికం వస్తోందా? అదేమీ లేదు. కానీ ఇవ్వాలన్న మనసు వుంది. అందుకే ఏ ఒక్క సినిమా మనిషి స్పందించకుండా వున్నవేళ సంపూర్ణేష్ స్పందించాడు.

ఇప్పుడు రెండురోజుల తరువాత విజయ్ దేవరకొండ అయిదు లక్షల రూపాయలు ప్రకటించాడు. దాంతో ఇక పెద్ద హీరోలు కదలక తప్పలేదు. ఎన్టీఆర్ 15 లక్షల రూపాయలు, కళ్యాణ్ రామ్ అయిదులక్షల రూపాయలు ప్రకటించారు. ఇక మిగిలిన వాళ్లు కూడా ఇదే విధంగా కోరస్ అందుకుంటారు.

సినిమాకు ఇరవై నుంచి పాతికకోట్లు తీసుకునే హీరోలు జనానికి తిరిగి ఇచ్చేసింది జస్ట్ అయిదులక్షలు, పాతిక లక్షలు. అది కూడా సంపూర్ణేష్ లాంటి వాళ్లు స్పందించబట్టి. లేకపోతే ఏమయ్యేదో?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments