టైగర్ ష్రాఫ్ చేతులమీదుగా సుధీర్ బాబు ట్రైలర్!

సుధీర్ బాబు హీరోగా విడుదలకు సిద్ధమౌతున్న తాజాచిత్రం ‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్ ను బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సోమవారం విడుదల చేస్తున్నారు. హీరో సుధీర్ బాబు గతంలో బాలీవుడ్ చిత్రం బాఘీలో, టైగర్ ష్రాఫ్ తో కలిసి విలన్ గా నటించాడు. అప్పటిలో ఏర్పడ్డ స్నేహాన్ని పురస్కరించుకుని... సుధీర్ బాబు హీరోగా రూపొందిన తాజా చిత్రం ట్రైలర్ ను టైగర్ ష్రాఫ్ విడుదల చేస్తున్నారు.

సుధీర్ బాబు సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు ముస్తాబవుతోంది. సమ్మోహనం విజయం సాధించిన తర్వాత.. సుధీర్ బాబు తన సొంత ప్రొడక్షన్ లో చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా ఆర్ ఎస్ నాయుడును సుధీర్ బాబు దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీచర్, ఫస్ట్ లుక్ లకు మంచి రెస్సాన్స్ రావడంతో ట్రైలర్ ను కూడా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రంలో నభా నటేశ్ హీరోయిన్ గా నటించారు. కొత్తహీరోయిన్ కావడం అనేది సినిమాకు ఫ్రెష్ నెస్ ను జోడించే అంశమే అయినా.. ఆమె ఎక్కడా కొత్త అన్నట్లుగా కాకుండా బాగా నటించినట్లు దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు చెబుతున్నారు. అజనీష్ మ్యూజిక్, సురేష్ కెమెరా వర్క్ అందించిన ఈ చిత్రంలో ఇంకా... నాజర్, తులసి తదితరులు నటించారు.

RELATED ఎమ్బీయస్‌: ఆర్‌బిఐ - ఆర్థికశాఖ రగడ - 1/2