తెలుగుదేశానికి.. మరో ఎంపీ ఝలక్?!

ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర బాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఇదే సమయంలో వలస విషయంలో మరో ఎంపీ పేరు తెరమీదకు వస్తుండటం విశేషం. ఈసారి వంతు కాకినాడ ఎంపీ తోట నరసింహంది అని అంటున్నారు. తాజాగా చంద్రబాబుతో సమావేశం అయిన తోట నరసింహం తదుపరి సమావేశం జగన్ తోనే అనే టాక్ వినిపిస్తోంది.

తోట నరసింహం వచ్చేసారి తనకు కాకినాడ ఎంపీ టికెట్ వద్దని అంటున్నారట. తనకు ఆరోగ్యం బాగోలేదని.. తను పోటీచేయడం లేదని.. తన భార్య జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటోందని.. ఆమెకు టికెట్ కేటాయించాలని ఈయన చంద్రబాబును కోరినట్టుగా తెలుస్తోంది.

జగ్గంపేటలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతులనెహ్రూ నెగ్గిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జ్యోతుల నెహ్రూను పక్కన పెట్టి... తోట నరసింహం కుటుంబానికి ప్రాధాన్యతను ఇస్తారా? అనేది సందేహంగానే కనిపిస్తోంది.

ఒకవేళ తమకు జగ్గంపేట టికెట్ ఖరారు కాకపోతే.. తెలుగుదేశం పార్టీని వీడటానికి తోట నరసింహం కుటుంబం రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?