ఒకే వారంలో 3 అడల్ట్ సినిమాలు

తెలుగుతెరపై అడల్డ్ సినిమాలు కొత్త కాదు. అడపాదడపా ఇవి వస్తూనే ఉన్నాయి. తాజాగా వీటిరాక మరింత ఎక్కువైంది. ఈ వీకెండ్ వీటి జోరు ఇంకాస్త ఎక్కువ కనిపిస్తోంది. అవును.. ఈ శుక్రవారం ఏకంగా ఆ టైపు సినిమాలు మూడు రిలీజ్ అవుతున్నాయి.

చీకటిగదిలో చితక్కొట్టుడు.. టైటిల్ చూస్తేనే మేటర్ సగం అర్థమైపోతుంది. సినిమా ట్రయిలర్ చూస్తే పూర్తిగా ఓ అవగాహనకు వచ్చేస్తాం. ఈమధ్య కాలంలో ఏడుచేపల కథ తర్వాత అంత ఘాటుగా ఉన్న ట్రయిలర్ ఇది మాత్రమే. ఈ సినిమాతో పాటు 4 లెటర్స్ అనే మరో సినిమా కూడా వస్తోంది. రొమాన్స్, లవ్ ముసుగులో ఈ సినిమాను కూడా దాదాపు సెమీ-పోర్న్ గా తయారుచేశారు. దీనికితోడు హీరోయిన్ల బికినీ స్టిల్స్ ను అదేపనిగా విడుదల చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు మిఠాయి అనే మరో మూవీ కూడా వస్తోంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ సినిమాలో కూడా అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ ఉంది. ఈ విషయాన్ని వీళ్లిద్దరూ ఒప్పుకోవట్లేదు కానీ సినిమా రిలీజ్ అయిన అసలు మేటర్ అందరికీ అర్థమౌతుంది. ఇలా ఈ 3 సినిమాలు ఒకే వారం థియేటర్లలోకి వస్తున్నాయి. ఏ, బి సెంటర్లు పక్కనపెడితే.. సి-సెంటర్లలో మాత్రం వీటికి కాస్త వసూళ్లు వచ్చేలా ఉన్నాయి.

నిజానికి ఈ వీకెండ్ ప్రముఖంగా వస్తున్న సినిమాలు ఇవికావు. ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా లైన్లో ఉంది. మరోవైపు నయనతార నటించిన అంజలి సీబీఐ సినిమా కూడా క్యూ కట్టింది. ఈ రెండు సినిమాలతో పాటు ఈ మూడు అడల్ట్ సినిమాలు కూడా సిద్ధమయ్యాయి. 

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments