ఈవారం ట్రేడ్‌ టాక్‌

గతవారం విడుదలైన 'లవర్స్‌ డే', 'దేవ్‌' రెండూ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాయి. మామూలుగా కార్తీ చిత్రాలకి మంచి ఓపెనింగ్స్‌ వస్తుంటాయి. కానీ దేవ్‌కి కనీస ప్రచారం లేకపోవడంతో తొలిరోజే ఇబ్బందిపడింది. ఇక టాక్‌ కూడా చాలా బ్యాడ్‌గా రావడంతో 'దేవ్‌' పెద్ద ఫ్లాప్‌ అయింది. తమిళంలోను ఈ చిత్రం డిజాస్టర్‌ దిశగా సాగుతోంది.

ప్రియాప్రకాష్‌ వల్ల సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన 'లవర్స్‌ డే' చిత్రం ప్రచారానికి తప్ప మరెందులోను మెప్పించలేకపోయింది. ఈ చిత్రం కూడా తొలిరోజే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుని వారం తిరగకుండా వానిష్‌ అయిపోయింది. గతవారం విడుదలయిన బాలీవుడ్‌ చిత్రం గల్లీబాయ్‌ ప్రశంసలు అందుకుంటోంది.

వసూళ్ల పరంగా కూడా సాలిడ్‌ ట్రెండ్‌ చూపిస్తూ రణ్‌వీర్‌ సింగ్‌ ఇమేజ్‌ని, స్టార్‌డమ్‌ని మరింత పెంచింది. ఈవారం విడుదలైన చిత్రాల్లో 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' మార్నింగ్‌ షో కలెక్షన్లు ఏమంత ఆశాజనకంగా లేవు. ఈ చిత్రానికి టాక్‌ కూడా అనుకూలంగా లేదు. 'మిఠాయి' చిత్రానికి కూడా ఎర్లీ రిపోర్ట్స్‌ ఏమాత్రం స్వీట్‌గా లేవు.