ఈవారం ట్రేడ్‌ టాక్‌

దీపావళికి రిలీజ్‌ అయిన సినిమాల్లో తమిళ 'సర్కార్‌' ఒక్కటే హిట్టయింది. విడుదలకి ముందే రేకెత్తించిన ఆసక్తికి తోడు మురుగదాస్‌ బ్రాండింగ్‌ వల్ల విజయ్‌కి తెలుగులో తొలి హిట్‌ దక్కింది. విజయ్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ రేట్లకి అమ్మినా కానీ వారం రోజుల్లోనే ఈచిత్రం లాభాల్లోకి ప్రవేశించింది. తమిళంలో అయితే అతి పెద్ద బాక్సాఫీస్‌ గ్రాసర్స్‌ లిస్టులో చేరిపోయింది.

ఇక భారీ అంచనాలతో విడుదలైన 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' తీవ్రంగా నిరాశ పరచింది. ఆమిర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌ లాంటి స్టార్స్‌కి తోడు రెండు వందల కోట్లకి పైగా బడ్జెట్‌, ప్రీ ఇండిపెండెన్స్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ చిత్రాన్ని కూడా 'బాహుబలి'లో యూనివర్సల్‌ సక్సెస్‌ చేస్తాయనే అంచనాలుండేవి. కానీ 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' అందరినీ నిరాశ పరచి, ఆమిర్‌కి అరుదైన పరాజయంగా మిగిలింది.

రవిబాబు దర్శకత్వంలో రూపొందిన 'అదుగో' డిజాస్టర్‌ అయింది. పంది పిల్లని ప్రధాన పాత్రగా పెట్టి రవిబాబు చేసిన ప్రయోగం దారుణంగా వికటించింది. విడుదలకి ముందే అసలు ఆకర్షించలేకపోవడంతో దీనికి కనీస వసూళ్లు కూడా నమోదు కాలేదు. నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' కూడా అతి పెద్ద ఫ్లాప్‌ అయింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మైత్రి మూవీస్‌ వారికి తొలి ఎదురుదెబ్బ తగిలింది.

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments