ఈ వారం ట్రేడ్‌ టాక్‌

'మా సినిమా బాగుంది కానీ కలక్షన్లు రావడం లేదు' అంటూ విచిత్రమైన స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారు 'తెనాలి రామకృష్ణ బిఏ. బిఎల్‌' మేకర్స్‌. సక్సెస్‌ మీట్‌ పెట్టి తమ సినిమా నచ్చిందని చెబుతోన్న వారి గురించి చెబుతూ ఈ చిత్రంతో బయ్యర్లకి నష్టం వస్తుందన్నారు. మరి అది ఏ రకంగా సక్సెస్‌ మీటో వారికైనా తెలుసో లేదో? ఫెయిల్యూర్‌ని అంగీకరించలేక వారు ఎన్ని విధాలుగా కవర్‌ డ్రైవ్‌లు కొట్టినా కానీ వాస్తవం ఏమిటంటే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఖచ్చితంగా తిప్పికొట్టారు.

ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం స్టేల్‌ అయిపోయిన ఐడియాలతో నాగేశ్వరరెడ్డి క్లాసిక్‌ తీసినట్టు ఫీలవుతున్నాడు కానీ ప్రేక్షకులకి ఈ కామెడీ నచ్చలేదు. అలాగే విశాల్‌ నటించిన 'యాక్షన్‌' చిత్రం ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు ప్రేక్షకులకి కొత్త రకం యాక్షన్‌ చూపించింది కానీ స్క్రిప్ట్‌ మీద శ్రద్ధ లేకపోవడంతో బోల్తా కొట్టింది. బాలీవుడ్‌నుంచి వరుస హిట్లు వస్తోన్న టైమ్‌లో తెలుగులో మాత్రం వరుస పరాజయాలు వేధిస్తున్నాయి.

ఖైదీ మినహా ఇటీవలి కాలంలో అందరికీ లాభాలు వచ్చిన సినిమా లేదు. డిసెంబర్‌ 13న వెంకీమామతో పెద్ద సినిమాల సందడి మొదలవుతుంది. అంతవరకు చాలా చిన్న చిత్రాలు అదృష్టం పరీక్షించుకోనున్నాయి. వాటిలో ఈవారం విడుదలైన జార్జి రెడ్డి ఒక వర్గం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది. అయితే అది కలక్షన్లుగా కన్వర్ట్‌ అవుతుందా లేదా అనేది చూడాలి.

Show comments