ఈవారం ట్రేడ్‌ టాక్‌

సైరా నరసింహారెడ్డి వసూళ్లు సెకండ్‌ వీకెండ్‌ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అంతవరకు తెలుగు రాష్ట్రాలలో పట్టు చూపించిన 'సైరా'కి దసరా సెలవుల తర్వాత సాధారణ వసూళ్లు మాత్రమే వస్తున్నాయి. అయితే ఇంకా అన్ని ఏరియాలలోను షేర్స్‌ వస్తూ వుండడంతో ఈ వీకెండ్‌లో కలక్షన్లు పుంజుకుంటాయని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో బాహుబలి చిత్రాల తర్వాత వంద కోట్ల షేర్‌ వసూలు చేసిన చిత్రంగా నిలిచిన 'సైరా' ఇతర ప్రాంతాల్లో మాత్రం అంచనాలని అందుకోలేకపోయింది.

నార్త్‌ అమెరికాలో ఆల్‌టైమ్‌ గ్రాసర్స్‌ లిస్ట్‌లో ఏడవ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. కర్నాటకలో అయితే బయ్యర్లకి భారీ నష్టం తప్పలేదు. బాహుబలి 1 బిజినెస్‌ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకుని ఈ చిత్రానికి భారీ రేట్లు పెట్టిన బయ్యర్లకి ఆ స్థాయి స్పందన లేకపోవడంతో నష్టాలు తప్పలేదు. పాన్‌ ఇండియా మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తోన్న తెలుగు సినిమా అందుకు తగ్గట్టుగా మార్కెటింగ్‌ ట్రిక్స్‌ని కూడా అమలులో పెట్టాల్సి వుంటుంది.

గతవారం విడుదలయినా ఆర్డీఎక్స్‌ లవ్‌ ఫ్లాప్‌ అయింది. పాయల్‌ రాజ్‌పుట్‌ గ్లామర్‌ కోసం థియేటర్లకి బారులు తీరిపోతారనే అంచనాలు తల్లకిందులయ్యాయి. అడల్ట్‌ కంటెంట్‌కి ఎంత స్వీట్‌ కోటింగ్‌ వేసినా ప్రతిసారీ సేల్‌ అవదని తేలిపోయింది. బాలీవుడ్‌ సినిమా 'వార్‌' మూడు వందల కోట్ల నెట్‌ వసూళ్లని సాధించే దిశగా సాగుతోంది. చాలా చోట్ల సైరా వసూళ్లపై 'వార్‌' ప్రభావం చూపించింది. 

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

Show comments