ఈవారం ట్రేడ్‌ టాక్‌

భారీ సినిమాలు లేని టైమ్‌లో ప్రతివారం రెండు, మూడు చిన్న చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న తరుణంలో వారానికి ఓ సినిమా క్లిక్‌ అవుతూ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా తర్వాత ఓ బేబీతో వరుసగా మూడవవారం మూడో విజయం టాలీవుడ్‌ని వరించింది. విడుదలకి ముందే ఆకర్షించిన ప్రోమోలతో పాటు సమంత స్టార్‌డమ్‌ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్‌ తెచ్చింది.

వినోదంతో పాటు భావోద్వేగాలు కూడా మెప్పించడంతో 'ఓ బేబీ' విజయాన్ని అందుకుంది. దీంతో పాటే విడుదలైన 'బుర్రకథ' మాత్రం తీవ్రంగా నిరాశపరచింది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న ఆది సాయికుమార్‌కి ఈసారి కూడా ఊరట లభించలేదు. స్పైడర్‌మేన్‌ కొత్త సినిమా కూడా ఆదరణ అందుకుంటోంది.

అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ తర్వాత స్పైడర్‌మేన్‌కే బెస్ట్‌ ఓపెనింగ్‌ వచ్చింది. ఈ వారం కూడా చిన్న చిత్రాలే అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక నటించిన 'దొరసాని'తో పాటు సందీప్‌ కిషన్‌ స్వీయ నిర్మాణంలో నటించిన 'నిను వీడని నీడను నేనే' చిత్రాలు విడుదలయ్యాయి. 

విదేశం నుంచి కాపీ కాదు.. రీమేక్!