దేవిశ్రీ ప్రసాద్ కూడా నిరూపించుకోవాల్సిందే

ఈ సంక్రాంతికి ప్రధానంగా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్యే పోటీ ఉంది. రేసులో మరికొన్ని సినిమాలున్నప్పటికీ మహేష్ బన్నీ సినిమాల మధ్య పోటీ ఇప్పట్నుంచే మొదలైంది. మహేష్ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తే, బన్నీ మరో పోస్టర్ రిలీజ్ చేస్తున్నాడు. మహేష్ టీజర్ రిలీజ్ చేస్తే, బన్నీ ఏకంగా సాంగ్ రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడీ పోటీ హీరోల మధ్య మాత్రమేకాదు, సంగీత దర్శకుల మధ్య కూడా నెలకొంది.

అవును.. అల వైకుంఠపురములో సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన ఓ సాంగ్ ఇప్పుడు సూపర్ హిట్ అయి కూర్చుంది. సామజవరగమన అనే ఈ పాట ట్రెండ్ అవ్వడమే కాదు, 7 లక్షల వైకులతో టాప్ లో నిలిచింది. ఇప్పటివరకు బన్నీ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా ఒకెత్తయితే.. తమన్ కంపోజ్ చేసిన ఈ ఒక్క సాంగ్ మరోఎత్తు.

తమన్ కంపోజ్ చేసిన ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలవడంతో ఇప్పుడు అందరి చూపు దేవిశ్రీప్రసాద్ పై పడింది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవిశ్రీ ఎలాంటి సాంగ్స్ ఇచ్చాడనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. సో.. కచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి సాంగ్స్ తో రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ డైరక్టర్స్ గా దేవిశ్రీ, తమన్ మధ్య గట్టి పోటీ ఉంది. సామజవరగమన సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో.. పోటీ ఇప్పుడు పీక్ స్టేజ్ కు చేరుకుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇంకా పాటల విడుదల కార్యక్రమం షురూ అవ్వలేదు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చిన వెంటనే సామజవరగమన సాంగ్ తో కంపారిజన్ ప్రారంభమవ్వడం గ్యారెంటీ. సో.. ఈసారి సంక్రాంతికి దేవిశ్రీ వెర్సెస్ తమన్ కూడా అన్నమాట.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?