తెలుగు రాని లోకేశ్‌ కూడా..

బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గురువారం స్థానిక పీవీఆర్‌ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు.

అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు.

‘మనబడి నాడు-నేడు’లో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనుంది. తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది చేయనున్నారు.

సీఎం వైఎస్ జగన్ కామెంట్స్....

- నేటి బాలలే రేపు సమాజ నిర్మాతలు
- మరో పదేళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించాలి.
- ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ లు అందుబాటులోకి వచ్చాయి.
- డ్రైవర్లు కూడా లేని కార్లు వస్తున్న రోజుల్లో మనం ఉన్నాం.
- ఇంగ్లీష్ రాకపోతే రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందో ఆలోచించాలి.
- 33 శాతం మంది పిల్లలకు చదువు రాని పరిస్థితుల్లో ఉన్నాం.
- కార్పోరేట్ స్కూల్స్ కి కొమ్ముకాయాలా... ప్రభుత్వ పాఠశాలలను శిథిలవస్థలో వదిలేయాలా..
- ఎవరూ చదివించని ప్రభుత్వ బడులను అలాగే వదిలేయాలా.
- పిల్లలు పోటీపడుతున్నది సమాజంతోనే కాదు.. ప్రపంచ జాబ్ మార్కెట్ తో 
- సంస్కృతి పేరుతో పిల్లలను పట్టించుకోకపోతే..భావితరలా ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది.
- ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి, ఏ సినిమా నటుడు, ఏ జర్నలిస్టు కూడా వాళ్ల పిల్లలను తెలుగు మీడియం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదు.
- పిల్లల భవిష్యత్ కోసం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంటే.. రాజకీయంగా, వ్యతిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. 
- నేను చేస్తున్నది తప్పు అన్నట్టుగా...నా వలన తెలుగు జాతి ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా నన్ను టార్గెట్ చేసి అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు.
- ఆరోపణలు చేసే వాళ్లు హిప్రోకసిని వదిలి డెమోక్రసికి విలువ ఇవ్వాలి.
- నాపై ఆరోపణలు చేస్తున్న వారిలో రాజకీయ నాయకులు ఉన్నారు..పత్రికాధిపతులు ఉన్నారు..చివరికి రాజ్యాంగ పదవిలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవి అనుభవిస్తున్న వాళ్లు ఉన్నారు...సినీ రంగంలో ప్రముఖ స్థానం సాందించిన వాళ్లు ఉన్నారు...వాళ్ల బిడ్డలు..వాళ్ల మనవళ్లు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.. పేదవాడు చదవకూడదా...  
- చరిత్రను మార్చే నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించాం.
- ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఎలా ఉన్నాయో..ఏడాది తరువాత ఎలా ఉన్నాయో...ఫోటోలు తీసి చూపిస్తాం.
- పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి 15 వేలు ఇస్తాం.

తెలుగు రాని లోకేశ్‌ కూడా..
సార్‌ మా నాన్న ఆటోడ్రైవర్‌. ఆయనకు రూ. 10 వేలు ఇస్తున్నందుకు థాంక్స్‌. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు ప్రవేశ పెడుతున్నందుకు ధన్యవాదాలు. అయితే కొంతమంది ఇంగ్లీషు మీడియం వద్దని చెబుతున్నారు. తెలుగు భాష రాని నారా లోకేశ్‌, ఇంటర్‌ పాస్‌ కాని పవన్‌ కల్యాణ్‌ ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు. ఎందుకిలా చెబుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్లు, వాళ్ల పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకోవచ్చు. మేం మాత్రం ఏం పాపం చేశాం సార్. పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే మాకు ఇంగ్లీష్ చాలా అవసరం. - హారిక

ఓటు హక్కులేదనే కాబోలు..
మా అక్క ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. సార్‌ నిజానికి ఎంతోమంది గొప్పవాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే. అయితే ఇప్పుడు అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. రాజకీయ నాయకులు వస్తారు. కానీ మాకోసం ఏమీ చేయరు. బహుశా మాకు ఓటు హక్కు లేదనే కాబోలు. మా గురించి మంచిగా ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు. నాడు నేడు తర్వాత మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టండి. - వి.హేమలత