మంత్రివర్గ విస్తరణ.. హరీష్ సంగతేంటి?

ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడొచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజులకు మంత్రివర్గ విస్తరణ చేయాలని భావించారు సీఎం. ఈ మేరకు గవర్నర్ ను కలిసి డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. ఏ పని చేసినా ముహూర్తాలు, జాతకాలు చూసే కేసీఆర్.. మంత్రివర్గ విస్తరణకు కూడా పౌర్ణమి సెంటిమెంట్ ఫాలో అయ్యారు. ఆయన జన్మనక్షత్రంతో సరిపోల్చి మరీ ఈ ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఇదిలా ఉండగా.. మంత్రివర్గ విస్తరణ అనగానే అందరి చూపు ఇప్పుడు హరీష్ రావుపై పడింది. స్వయానా కేసీఆర్ మేనల్లుడు అయినప్పటికీ, గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నప్పటికీ హరీష్ రావుకు ఈసారి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. గత టర్మ్ లో మంత్రిగా విధులు నిర్వహించిన హరీష్ రావుకు ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందా దక్కదా అనే ఉత్కంఠ అందర్లో ఉంది. దీనికి ఎన్నో కారణాలు.

పార్టీలో కేసీఆర్, హరీష్ రావుకు పెద్దగా పడట్లేదనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కొడుకు కేటీఆర్ ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి, ఎక్కువ ప్రాధాన్యం అతడికే ఇవ్వడంతో హరీష్ రావు అలకబూనారని అంటారు. దీనికి తోడు ఓ గౌరవాధ్యక్ష పదవికి హరీష్ రాజీనామా చేయడంతో పాటు, అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయడం ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో హరీష్ కు చోటు దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు కేసీఆర్ కావాలనే హరీష్ ను పక్కనపెడుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో హరీష్ తో పాటు తను కూడా ఎంపీగా పోటీచేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే హరీష్ ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పిస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి.

హరీష్ తో పాటు కేటీఆర్ మంత్రి పదవిపై కూడా చిన్నపాటి సస్పెన్స్ కొనసాగుతోంది. కేటీఆర్ ను పూర్తిగా పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తారా లేక మంత్రిపదవి కూడా ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. 19వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ సస్పెన్స్ వీడనుంది.

రాజ్యాంగం ప్రకారం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది సభ్యులకు చోటుంది. ముఖ్యమంత్రి, హోం మంత్రిని మినహాయిస్తే.. మరో 16 మందికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలి. మంగళవారం నాడు జరిగే మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత మిగతా పదవుల్ని భర్తీ చేస్తారట. 

నాకు ఆవిడంటే చాలా ఇష్టం : వీరమాచినేని 

నాకు స్టామినా చాలా ఎక్కువ

Show comments