మేకోవర్ పూర్తి.. త్వరలోనే కొత్త సినిమా

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత పూర్తిగా గ్యాప్ తీసుకున్న సాయిధరమ్ తేజ్, ఆ గ్యాప్ ను బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. పెరిగిన బరువును తగ్గించుకోవడంతో పాటు.. హెయిర్ స్టయిల్ ను కాస్త మార్చుకున్నాడు. జుట్టు ఊడే సమస్యతో బాధపడుతున్న తేజు, దానికి సంబంధించి కాస్ట్ లీ ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. మొత్తానికి ఇప్పుడు మరోసారి కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. 

ఈ ఏడాది ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు సినిమాలతో వరుసగా ఫ్లాపులిచ్చాడు తేజు. ఈ మూవీస్ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని అంతా భావించినప్పటికీ, అనూహ్యంగా గ్యాప్ తీసుకున్నాడు. అలా షార్ట్ గ్యాప్ తర్వాత సరికొత్తగా ముస్తాబైన తేజు, ఈ నెలాఖరుకు కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు. 

ప్రస్తుతం ఇతడ్ని హీరోగా నిలబెట్టేందుకు మెగా కాంపౌండ్ కాస్త గట్టి ప్రయత్నమే చేస్తోంది. కిషోర్ తిరుమల సినిమాతో పాటు రీసెంట్ గా గీతగోవిందంతో హిట్ కొట్టిన పరశురాంతో ఓ ప్రాజెక్టు సెట్ చేసే పనిలో ఉంది. ఈ రెండు సినిమాల్లో ఒకటి ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. 

RELATED చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?