తేజ్ సరసన నభానటేష్

రాశీఖన్నాతో జోడీ కట్టి, ప్రతిరోజూ పండుగే అనే సినిమా మారుతి డైరక్షన్ లో చేస్తున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా 60 శాతం పూర్తయింది. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడితో ఒకటి, దేవాకట్టా డైరక్షన్ లో మరోటి. సుబ్బు అనే కొత్త దర్శకుడితో చేయబోయే సినిమాకు నిర్మాత భోగవిల్లి ప్రసాద్. 

ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నభా ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి, తన మీద వున్న ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసుకుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వెర్షన్ జరుగుతన్న ఈ సినిమా నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం వుంది. ప్రతిరోజూ పండగే సినిమా అక్టోబర్ 10 నాటికి పూర్తయిపోతుంది. మిగిలిన పని ఆ నెలాఖరకు ఫినిష్ చేసి, నవంబర్ నుంచి కొత్త సినిమా మీదకు తేజ్ వెళ్తాడని తెలుస్తోంది.

అయితే ప్రతి రోజూ పండుగే సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా? వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల అవుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వచ్చే ఏడాదిలో షెడ్యూలు చేస్తే, 2020లో సాయితేజ్ మూడు సినిమాలు అందించే అవకాశం వుంది.