విజయనగరంలో టీడీపీ వీక్‌

విజయనగరంలో తెలుగుదేశం పార్టీ కోలుకోలేకపోతోంది. పొత్తులు ఎత్తులతో మరింతగా ఇబ్బంది పడుతోంది. నెల్లిమర్ల అసెంబ్లీ టిక్కెట్‌ జనసేనకు కేటాయించడంతో ఆ సీటులో గెలుపు ఆశల మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే విధంగా గజపతినగరం సీటులో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు కాకుండా ఆయన కజిన్‌ శ్రీనివాస్‌కు ఇవ్వడంతో అసమ్మతి అక్కడ రాజుకుంది.

ఎస్‌ కోటలో చూసుకుంటే ఎన్నారైకి టిక్కెట్‌ ఇవ్వకపోతే ఆర్ధికంగా అక్కడ ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు తమ కుమార్తెను పోటీకి పెట్టారు. కానీ తూర్పు కాపులు బీసీలు మాత్రం తమ సీటులో ఓసీకి ఎలా ఇస్తారని గుర్రుమీద ఉన్నారు.

బొబ్బిలిలో తీసుకుంటే బొబ్బిలి రాజులు గెలుపు తమదేనని చెబుతున్నా అక్కడ మొదటి నుంచి కాంగ్రెస్‌ గత రెండు ఎన్నికల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచే అభ్యర్ధులు గెలుస్తున్నారు. టీడీపీ బోణి కొట్టి మూడు దశాబ్దాలు గడచింది. దాంతో ఈసారి గెలుపు సాధ్యమేనా అన్న చర్చ ఉంది.

Readmore!

సాలూరు, కురుపాం, పార్వతీపురం మూడు కూడా వైసీపీ ఖాతాలో పడతాయని, చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ విజయం మరోసారి ఖాయమని అంటున్నారు.

Show comments