టీడీపీ టు వైఎస్సార్సీపీ.. నెక్ట్స్ వీళ్లేనా..?!

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనుకున్న ఆమంచి కృష్ణమోహన్ దాదాపుగా ఆ లాంఛనాన్ని పూర్తి చేస్తున్నట్టే. కేవలం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడమే గాక.. చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న అనైతిక రాజకీయం గురించి, టీడీపీపై ఉన్న కులతత్వ ఆరోపణల గురించి ఆమంచి మాట్లాడారు.

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలకు సంబంధించి.. వడ్డీ డబ్బును వెనక్కు ఇవ్వకుండా.. వారు వడ్డీలుగా కట్టిన మొత్తాన్ని ఉచితసాయం పేరుతో.. ఎన్నికల ముందు ఒక్కోరికి వెయ్యి, రెండువేల రూపాయలు చేతిలో పెడుతూ.. చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న రాజకీయ దుర్మార్గాన్ని ఆమంచి ప్రస్తావించారు. వాళ్ల వడ్డీ డబ్బులు వాళ్లకే ఇస్తూ.. ఓట్లను కొనుగోలు చేసే రాజకీయాన్నీ ఆమంచి ప్రస్తావించారు.

వాస్తవానికి చీరాలలో ఆమంచికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను ఖాయంగా ఇచ్చే పరిస్థితే ఉంది. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది టీడీపీలో ఉన్నా.. మరీ అభ్యర్థిత్వానికి పోటీగా వచ్చేవాళ్లు లేరనే చెప్పాలి. అయినా ఆమంచి తెలుగుదేశం పార్టీని వీడారు.

ఇక ఈ జాబితాలో తదుపరి పేర్లు ఏవి? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఇప్పటి వరకూ ముగ్గురు సిట్టింగులు టీడీపీని వీడారు. రావెల కిషోర్ బాబు జనసేనలోకి చేరిపోయారు. మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టే.

ఇక తదుపరి ఎవరు? అంటే.. ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల కూడా చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అవంతి కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఎంపీగా గెలిస్తే.. పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవిని ఆఫర్ చేశారట చంద్రబాబు. అదంతా సరదాగా జరిగిన సంభాషణే.

ఇక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోవచ్చు అనే ఊహాగానంలో ఉన్న మరో పేరు తోట త్రిమూర్తులు. ఈ ఎమ్మెల్యే కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూట్లో ఉన్నారని సమాచారం. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లు కూడా ఈ ప్రయత్నంలో ఉన్నారని.. అయితే గంటాను భరించేందుకు ఏ పార్టీ కూడా రెడీగా లేదనే టాక్ వినిపిస్తోంది.

మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పక్కచూపులు చూస్తున్నారని.. కొన్ని అనూహ్యమైన పేర్లు కూడా ఈ జాబితాలో ఉండబోవచ్చనే మాట వినిపిస్తోంది.

నా నోరు మూయించాలని చూశారు : వీరమాచినేని

పబ్లిక్ పల్స్ : ఆ నియోజకవర్గంలో జనసేనపై ఏమనుకుంటున్నారు..

Show comments