సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న పసుపుదళం

పసుపుదళం రెడీ అయిపోయింది. జగన్ గెలిచిన 2 రోజులకే సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా విషం చిమ్మడం ప్రారంభించింది. మొన్నటివరకు అధికారం చేతిలో పెట్టుకొని జగన్ పై ఉన్నవి లేనివి సృష్టించిన ఎల్లో ఆర్మీ.. ఇప్పుడు అధికారం కోల్పోయినా తమ పంథా మార్చలేదు. జగన్ చారిత్రక విజయం అందుకోవడాన్ని ఈ బ్యాచ్ జీర్ణించుకోలేకపోతోంది. తమ వైఫల్యాల్ని వదిలేసి, జగన్ పై విమర్శలు షురూ చేసింది.

ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే గెలిస్తే దాన్ని ప్రజాతీర్పు అని చెప్పేది ఎల్లో బ్యాచ్. కానీ బాబు ఓడిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ప్రజలు శిక్ష అనుభవిస్తారట. టీడీపీని వద్దనుకున్నందుకు మరో ఐదేళ్ల పాటు కష్టాలు పడతారట. అంతేకాదు, ప్రజల్ని గొర్రెలు అనేంత సాహసానికి కూడా దిగారు వీళ్లంతా. గొర్రెలు కసాయివాడ్నే నమ్మాయి అనే అర్థం వచ్చేలా పోస్టులు పెడుతున్నారు.

ఇవన్నీ ఒకెత్తయితే, ఈవీఎంలపై వీళ్లు ఏడుపు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఎన్నికల్లో క్వీన్ స్వీప్ జరిగితే ఈవీఏంలలో ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలంటారు. అలా కిందపడినా పైచేయి మాదే అంటున్నారు సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు.

ఇంతకంటే సిగ్గుమాలినతనం, నీచం ఇంకేదీ ఉండదేమో. ఓటమిని హుందాగా అంగీకరించాల్సింది పోయి ఇలా బరితెగించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ ను తిట్టారు. ఇప్పుడు అధికారం పోయిన వెంటనే ప్రజల్ని తిట్టడం మొదలుపెట్టారు.

ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలన ఇంకా ప్రారంభం కాలేదు. ఆయన పాలన మొదలైన తర్వాత నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే అది అందరికీ మంచిది. అంతేతప్ప, ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకే మరింత డ్యామేజీ జరుగుతుంది. ప్రజల దృష్టిలో టీడీపీ మరింత చీప్ అయిపోతుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. 

సినిమా రివ్యూ: సీత