పాత కబురే.. పవన్ కు బాబు పాతిక సీట్లు!

తమ పార్టీ తెలుగుదేశంతో కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఉండదని పవన్ కల్యాణ్ చెప్పుకొంటూ ఉంటాడు. అయితే తెలుగుదేశంతో పవన్ కల్యాణ్ పార్టీ పొత్తు ఉంటుందనే సంకేతాలను మాత్రం అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఇస్తూనే ఉన్నారు.

జనసేనతో పొత్తుకు రెడీ అని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఓపెన్ గా చెప్పేశాడు. ఇక పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు చెబుతున్నదే పవన్ కూడా చెబుతున్నాడు. ఫలితంగా... వీళ్ల పొత్తు ఖాయమనే అభిప్రాయాలకు మరింత బలం చేకూరుతూ ఉంది.

ఇక తాజాగా మళ్లీ సీట్ల ఒప్పందం వార్తలు వస్తున్నాయి. పాతిక ఎమ్మెల్యే, రెండు మూడు ఎంపీ టికెట్లను జనసేనకు కేటాయించడానికి చంద్రబాబు నాయుడు సంసిద్ధంగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. గతంలోనూ ఈ తరహా ఊహాగానాలు వచ్చాయి. మళ్లీ అవే వినిపిస్తూ ఉన్నాయి.

ఎవరితోనో ఒకరితో పొత్తులేనిది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్లడు. వెళ్లలేడు. ఆయన చరిత్ర అంతా పొత్తులమయమే. కొన్నిసార్లు బాబును పొత్తులే విజయానికి చేర్చాయి. మరి కొన్నిసార్లు పొత్తులు కూడా కాపాడలేకపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల విషయంలో బాబు పవన్ విషయంలో ఆశతో ఉన్నాడు. ఆ ఆశలను బాహాటంగానే చెప్పుకున్నాడు.

ఒకదశలో పవన్ కల్యాణ్ మోడీ మనిషి అని విమర్శించిన బాబు.. పొత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడటం లేదిప్పుడు. ఇక చంద్రబాబును పవన్ కల్యాణ్ ఎన్ని రకాలుగా విమర్శించాడో చెప్పనక్కర్లేదు. బాబు రిటైర్మెంట్ కు సమయం వచ్చిందని కూడా అన్నాడు.

బాబు ప్రభుత్వం అవినీతిమయం అన్నాడు. లోకేష్ ను విమర్శించాడు. తనపై వ్యక్తిగతంగా కూడా లోకేష్ కుట్ర చేశాడన్నాడు. అందుకు సంబంధించిన విమర్శలు చాలానే  ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ అన్నీ మరిచిపోయి మళ్లీ చంద్రబాబుతో పొత్తుకు వెళితే అంతకన్నా ప్రహసనం మరోటి ఉండదు.

అప్పుడు చంద్రబాబు నాయుడి కన్నా పవన్ కల్యాణ్ పెద్ద అవకాశవాది అవుతాడు. ముఖ్యమంత్రి అవుతానంటూ పదీ, పాతిక సీట్లలో పోటీకి పరిమితం అయితే.. అప్పుడు పవన్ వి ఉత్తుత్తి బీరాలే అని కూడా స్పష్టం అవుతుంది.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!

Show comments