టీడీపీ కామెడీ ఆపట్లేదసలు!

తమచేతిలో అధికారం ఉన్న ఐదు సంవత్సరాలూ పొడచలేకపోయారు కానీ, ఇప్పుడు మాత్రం తాము ఇచ్చిన అడ్డగోలు హామీలను అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు! వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో డిమాండ్ చేసేస్తూ ఉంది.

ఇప్పటికే ఒకసారి చంద్రబాబు నాయుడు ఆ డిమాండ్ ను చేశారు. తన పార్టీ వాళ్లతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు రుణమాఫీ, పసుపు కుంకుమ తదితర హామీలను అమలు పరచాలని డిమాండ్ చేసేశారు! రుణమాఫీ జరిగిపోయిందని తెలుగుదేశం పార్టీ తమచేతిలో అధికారం ఉన్న ఐదేళ్ల పాటూ చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ హామీని జగన్ అమలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసేశారు.

చంద్రబాబు నాయుడే కాదు.. యనమల కూడా అదే డిమాండే చేస్తూ ఉన్నారు. రుణమాఫీ హామీని అమలు చేయాలని, తాము ఐదేళ్ల కిందట ఇచ్చిన ఇతర హామీలు చేయడం కూడా ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అని యనమల చెప్పుకొచ్చారు.

ప్రజలు ఐదేళ్లపాటు అధికారం ఇస్తే, ఇచ్చిన హామీలను అమలుచేసే చేవ లేకపోయింది కానీ, తాము ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు డిమాండ్ చేయడం ప్రహసనంగా మారింది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం