చౌదరి ఇరుక్కుంటే అలా, రెడ్డి ఇరుక్కుంటే ఇలా!

బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని వాటిని ఎగ్గొట్టాడు సుజనా చౌదరి. షెల్ కంపెనీలను సృష్టించి సుజనా చౌదరి బ్యాంకర్లకు పంగనామాలు పెట్టాడని అభియోగాలు నమోదయ్యాయి. బ్యాంకుల సొమ్ము అంటే.. అది ప్రజల డైరెక్ట్ సొమ్ము. ప్రభుత్వ సొమ్ము కూడా ప్రజల సొమ్మే అయినా, బ్యాంకుల సొమ్ము ప్రజల కష్టార్జితం. బ్యాంకులు ఇలాంటి వాళ్ల వల్ల నష్టపోతే ఆ ప్రభావం ప్రజల మీద డైరెక్టుగా పడుతుంది!

అసలే బ్యాంకింగ్ ఫ్రాడ్స్ మీద దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బ్యాంకులకు అప్పులను ఎగ్గొట్టే బిగ్ షాట్స్ ను తీవ్రవాదుల్లాగా చూస్తున్నారు జనాలు. మరి అలాంటి అభియోగాలనే ఎదుర్కొన్న సుజనా చౌదరిని ఈడీ విచారణకు పిలిస్తే చంద్రబాబు నాయుడుకు చాలా బాధనిపించింది.

తెలుగుదేశం పార్టీకి మరింత బాధనిపించింది. అందుకే ఆ విషయంలో మోడీని దోషిగా చూపించేశారు. కక్షసాధింపు చర్యలు అన్నారు. అలా వాపోయారు. కట్ చేస్తే.. ఈసారి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వంతు. చెన్నైలో పట్టుబడిన ఒక హవాలా రాకెట్ వద్ద తీగలాగితే.. మాగుంట వద్ద డొంక కదిలిందట. ఈయనపై ఐటీ కన్నుపడింది. భారీ ఎత్తున్న సోదాలు జరిగాయి.

ఈ సోదాల్లో భారీ స్థాయిలో డబ్బు, బంగారం కూడా పట్టుబడిందని తెలుస్తోంది. ఇదంతా ఇన్ కమ్ టాక్స్ కట్టని సొమ్ముగా తేలుతుందేమో చూడాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటివరకూ ఐటీ అధికారులు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు!

విశేషం ఏమిటంటే.. మాగుంట వ్యాపార సామ్రాజ్యం మీద ఐటీదాడులు జరిగితే తెలుగుదేశంపార్టీ స్పందించలేదు. తమ పార్టీ ఎమ్మెల్సీ మీద ఐటీదాడులు జరిగితే టీడీపీ నుంచి రియాక్షనే లేకపోవడం విశేషం. ఇది కక్షసాధింపు చర్య అనో, టీడీపీ మీద మోడీ కత్తి గట్టడం అనో.. తమ రొటీన్ డైలాగులను కూడా టీడీపీ నేతలు ఉపయోగించకపోవడం విశేషం.

చౌదరి దొరికిన వ్యవహారంతో పోలిస్తే మాగుంట వ్యవహారం చాలా చిన్నది. మాగుంట వద్ద భారీస్థాయిలో నల్లధనం పట్టుబడింది అనుకున్నా.. ఆ వ్యవహారంపై ఐటీశాఖ విచారణ చేసి, ఫైన్ వేసే అవకాశాలుంటాయి. అయితే చౌదరి ఏకంగా బ్యాంకులకు పంగనామం పెట్టాడు.

చౌదరినేమో తెలుగుదేశం పార్టీ చాలా వెనకేసుకు వచ్చింది. మాగుంట విషయంలో మాత్రం తెలుగుదేశం సైలెన్స్ ను మెయింటెయిన్ చేస్తోంది! కారణం ఏమిటబ్బా!

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?

Show comments