హిందీలో దేవరకొండ సినిమా రీమేక్ జరుగుతోందా!

విజయ్ దేవరకొండ తెలుగులో హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమా హిందీలో రీమేక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా తెలుగులో బాగానే ఆడింది. విడుదలలో బాగా జాప్యం జరిగినా, అప్పటికే పైరసీ వెర్షన్ నెట్ లోకి వచ్చినా ఆ సినిమా ఫర్వాలేదనిపించుకునే విజయాన్ని సొంతం చేసుకుంది.

అక్కడకూ కారులో దెయ్యం అనే కాన్సెప్ట్ తో పలు సినిమాలు వచ్చాయి. అయినా విజయ్ దేవరకొండ సినిమా బాగానే ఆడింది. నయనతార సినిమా కూడా ఒకటి అదే తరహాలోనే ఉంటుంది. అయినా టాక్సీవాలా వచ్చింది, ఆడింది.

ఆ సంగతలా ఉంటే.. ఆ సినిమా హిందీ రీమేక్ గురించి అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సైలెంట్ గా ఆ సినిమా రూపొందుతోందని సమాచారం. హిందీ వెర్షన్లో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తూ ఉన్నాడని సమాచారం.

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే

Show comments