లైంగికంగా వేధించారన్న బాలయ్య హీరోయిన్!

తను శ్రీదత్తా.. ‘ఆషిక్ బనాయా అప్నే’తో అప్పట్లో సంచలనంగా నిలిచిన ఈ హీరోయిన్ ఇటీవలే మీడియా ముందుకు ముందుకు వచ్చింది. అప్పట్లో ఒక వెలుగు వెలిగిన ఈ భామ తెలుగులో నందమూరి నటసింహం బాలయ్య సరసన కూడా ఒక సినిమా చేసింది. ఈ విధంగా తెలుగు వారికి పరిచయస్తురాలు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తనుశ్రీలో చాలా మార్పు వచ్చింది. ప్రత్యేకించి చాలా లావు అయ్యి, గుర్తు పట్టలేనంతగా మారింది. ఇక ఇప్పుడు ఇండియన్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తోంది తనుశ్రీ.

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఈ మాజీ హీరోయిన్ చెప్పింది. తను పనిచేసిన నాటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమే అని చెప్పింది. తనుకూడా వాటి బాధితులురాలినే అని వ్యాఖ్యానించింది. 2008లో ఒక సినిమా షూటింగులో తనను ఒక సహనటుడు చాలా ఇబ్బంది పెట్టాడు అని, డ్యాన్స్ భంగిమల గురించి వివరిస్తానని చెప్పి తనతో అనుచితంగా ప్రవర్తించాడని తనుశ్రీ వివరించింది.

అతడి పేరును మాత్రం చెప్పలేదు తను శ్రీదత్తా. తను వేధింపులను ఎదుర్కొన్నది మాత్రం నిజం అని అంటోంది. తను మాత్రమే గాక చాలామంది హీరోయిన్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది.

ఇక ఇండియాలో హీరోయిన్లు ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నా వారు బయటకు చెప్పలేరని, సమాజం అలా చెప్పినా పెద్దగా పట్టించుకోదని.. కాబట్టి ఇలాంటి వేధింపులు మరుగునే పడిపోతాయని తనుశ్రీ అభిప్రాయపడింది.