తానా సభలకు ఎన్టీవీ చౌదరి

అమెరికాలోని తెలుగువారి సంఘం తానా. ఏటా జరిగే తానా సభలకు చాలామంది సెలబ్రిటీస్ వెళ్తుంటారు. కొందరు సెలబ్రిటీస్ కు తానానే స్వయంగా ఆహ్వానం పలుకుతుంది. ఈ ఏడాది తానా సభలకు ఆహ్వానితుల పేర్లలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, తదితరుల పేర్లు బయటకు వచ్చాయి.

తెలుగునాట ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన ఎన్ టీవీ సంస్థ అధినేత చౌదరికి కూడా తానా ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. అంతేకాదు. అక్కడ తానా సభల కార్యక్రమాల్లో భాగంగా జరిగే బిజినెస్ సెమినార్ లో ఎన్టీవీ చౌదరి పాల్గొని కీలక ఉపన్యాసం ఇస్తారు.

తానా సభలు ఏటా అట్టహాసంగా జరుగుతాయి. ఈసారి సభలకు ఎప్పటిలాగే పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన సారథ్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు

Show comments