తమ్ముళ్లు వస్తున్నారు

యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్, విజయ్ దేవరకొండలు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఏళ్లు కాలేదు. వాళ్లిద్దరూ నిలదొక్కోవాల్సి వుంది. ఇంతలోనే ఇద్దరి తమ్ముళ్లు ఇండస్ట్రీలోకి వచ్చేసారు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా ఇంకా స్టార్ట్ అయింది, విజయ్ దేవరకొండ సోదరుడి సినిమా అప్పుడే ఫస్ట్ లుక్ దగ్గరకు వచ్చేసింది. మహేంద్ర డైరక్షన్ లో మధుర శ్రీధర్, యాష్ రంగినేని నిర్మించే దొరసాని సినిమా ఫ్రీ లుక్ వరకు వచ్చింది. 30న ఫస్ట్ లుక్ వస్తుంది.

విజయ్ దేవరకొండ సొదరుడు ఆనంద్, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను వీలయినంత త్వరలో విడుదల చేసే దిశగా చకచకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు.

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు