తాప్సి మాజీ ప్రియుడికి త్వరలోనే పెళ్లి

హీరోయిన్ తాప్సి డేటింగ్ వ్యవహారం గుర్తుందా? ఇప్పుడంటే ఆమె బాలీవుడ్ లో ఉంది కానీ ఒకప్పుడు హైదరాబాద్, చెన్నై మధ్య చక్కర్లుకొట్టేది. ఆ టైమ్ లోనే ఆమె డేటింగ్ కూడా నటిచింది. అప్పట్లో తమిళ నటుడు మహత్, తాప్సి ఓ రేంజ్ లో ప్రేమించుకున్నారు. నెమ్మదిగా క్రేజ్ వచ్చిన తర్వాత మహత్ నుంచి దూరమైంది తాప్సి.

అలా తాప్సికి దూరమైన మహత్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాప్సికి దూరమైన తర్వాత కొన్నాళ్లు సింగిల్ గా ఉన్న మహత్, ఆ తర్వాత మాజీ మిస్ ఇండియా ప్రాచీకి కనెక్ట్ అయ్యారు. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట, మూడు ముళ్లతో ఒక్కటి కాబోతోంది. అవును.. వీళ్లు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని మహత్ స్వయంగా ప్రకటించాడు. త్వరలోనే పెళ్లి తేదీ చెబుతానంటున్నాడు.

తమిళనాట ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. హీరో ఆర్య, సాయేషా ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. హీరో విశాల్ కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పుడు మహత్ రాఘవేంద్ర కూడా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్నాడు. తెలుగులో లేడీస్ అండ్ జెంటిల్మేన్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాంటి సినిమాల్లో కనిపించిన మహత్.. ప్రస్తుతం తమిళనాట సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు.

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?