శ్రీదేవి బయోపిక్ ఛాన్సిస్తే రెడీ అంటున్న హీరోయిన్!

బహుశా ఈ స్టేట్ మెంట్ ఇవ్వడానికి కూడా కొంచెం ధైర్యం ఉండాలేమో. అలాంటి ధైర్యాన్నే వ్యక్తపరుస్తూ ఉంది తమన్నా. దివంగత నటి శ్రీదేవి బయోపిక్ రూపొందిస్తే, అందులో శ్రీదేవి పాత్రను చేయడానికి తను రెడీ అని తమన్నా అంటోంది. కొన్నేళ్ల కిందట హిందీలో ‘హిమ్మత్ వాలా’ అనే సినిమా వచ్చింది. అది పాత తెలుగు-హిందీ సినిమాకు రీమేక్. పాత వెర్షన్లలో హీరోయిన్ శ్రీదేవి. హిందీ వెర్షన్ లేటెస్ట్ రీమేక్ లో తమన్నా నటించింది. శ్రీదేవి చేసిన పాత్రను చేసింది. ప్రత్యేకించి ఒక పాట రీమిక్స్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టింది తమన్నా.

ఇప్పుడు ఫుల్ లెంగ్త్ శ్రీదేవి పాత్రను చేయడానికి రెడీ అంటోంది. మరి తమన్నాకు ఆ అవకాశం ఎవరైనా ఇస్తారో ఇవ్వరో చూడాల్సి ఉంది. శ్రీదేవి బయోపిక్ కు ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా? అనేది కూడా సందేహమే. తమన్నా కోరిక తీరుతుందో లేదో కానీ.. ఇంకా కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

ఈమె నటించిన తమిళ సినిమా ‘పెట్రోమ్యాక్స్’ విడుదలకు రెడీ అవుతోంది. తెలుగులో హిట్టైన ఆనందోబ్రహ్మ సినిమాకు రీమేక్ అది. తమిళంలో తనది హీరో పాత్ర ఏమీ కాదని, ప్రధాన పాత్ర మాత్రమే అని తమన్నా చెబుతోంది. సినిమాలో ప్రధాన పాత్రలో గుండామణి కూడా నవ్విస్తాడని, ఆయన కామెడీని ఉద్దేశించే ఆ టైటిల్ పెట్టినట్టుగా చెబుతోంది.

తను హారర్-కామెడీ సినిమాలకు పరిమితం కావాలని అనుకోవడం లేదని, విశాల్ సరసన ఒక యాక్షన్ సినిమాలో నటించబోతున్నట్టుగా చెప్పింది. అలాగే తనను ‘మిల్కీబ్యూటీ’ అంటూ పిలవడం కూడా తనకు అంత ఆనందాన్ని ఏమీ ఇవ్వదని తమన్నా అంటోంది. తనకు తల్లిదండ్రులు పెట్టిన పేరుందని, అదంటేనే తనకు ఇష్టమని దానితో పిలిస్తే చాలని, ప్రత్యేకంగా ట్యాగ్ లు వద్దని చెబుతోంది.

వరుసగా కొన్ని హారర్-కామెడీల్లో నటిస్తూ వస్తున్నా.. దెయ్యాలంటే భయం లేదంటోంది తమన్నా. దర్శకత్వం చేసే ఉద్దేశం లేదని కూడా లేదని అంటోంది. డైరెక్షన్ అంటే చాలా ఓపిక ఉండాలని, అంత ఓపిక తనకు లేదని చెబుతోంది! 

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!