తమన్న ఔట్.. నెక్ట్స్ వైల్డ్ కార్డ్ ఎవరు?

అంతా ఊహించినట్టే జరిగింది బిగ్ బాస్ హౌజ్ ను రచ్చచేసిన తమన్న బయటకు వెళ్లింది. ఆమె బయటకు వెళ్లింది అనే గౌరవమైన పేరు వాడే కంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, ప్రేక్షకులు కలిసి ఆమెను హౌజ్ నుంచి బయటకు గెంటేశారని చెప్పడం కరెక్ట్. అంతలా ఆమెను అసహ్యించుకున్నారంతా. ఆమె ఎలిమినేషన్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి ప్రసారం అవుతుంది.

బిగ్ బాస్ సీజన్ -3లో మొట్టమొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా గుర్తింపు తెచ్చుకుంది తమన్న. ఓ ట్రాన్స్ జెండర్ కు హౌజ్ లో స్థానం కల్పించి పెద్ద సంచలనమే సృష్టించింది స్టార్ మా యాజమాన్యం. అయితే ఆ సంచలనం కాస్తా అసహ్యంగా మారింది. అందరూ కలిసి ఏవగించుకునే స్థాయికి చేరింది. హౌజ్ లోకి ఎంటరైన తమన్న, మరుసటిరోజు నుంచే తన విశ్వరూపం చూపించింది. గొడవ పడితేనే హౌజ్ లో ఉండనిస్తారేమో అనే విధంగా రెచ్చిపోయింది.

ఒకదశలో రవికృష్ణపై ఆమె చేసిన ఆరోపణలు, అలీ రెజాపై విరుచుకుపడిన తీరుచూసి బిగ్ బాస్ కార్యక్రమాన్నే అసహ్యించుకున్నారు చాలామంది ప్రేక్షకులు. అంతేకాదు, తమన్న ఎంటరైన రెండో రోజుకే ఆమె ఎలిమినేట్ అయిపోతుందనే విషయాన్ని అంతా నిర్థారించారు. మొత్తానికి హౌజ్ లో ఇతర కంటెస్టెంట్లుకు ఊపిరి తీసుకునే వెసులుబాటు దక్కింది. వారంరోజుల పాటు హౌజ్ ను కంగాళీ చేసిన తమన్న బయటకు వెళ్లిపోయింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత మీడియాలో చేయబోయే రచ్చ తలుచుకొని భయపడుతున్నారు చాలామంది.

తమన్న బయటకు వెళ్లిపోవడం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీపై జోరుగా చర్చ సాగుతోంది. ఈసారి హెబ్బాపటేల్ లాంటి ఓ హాట్ బ్యూటీని హౌజ్ లోకి పంపించే ఏర్పాట్లలో ఉన్నారట నిర్వహకులు. మరోవైపు ఒకేసారి 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈరోజు రాత్రికి దీనిపై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నాడు నాగార్జున.

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది