సైరా... యు/ఎ..నో కట్స్

మెగాస్టార్ మెగా మూవీ సైరా సెన్సారు పూర్తయింది. సినిమా విడుదల మరో వారానికి పైగా దూరంలో వుండగానే సెన్సారు చేయించేయగలడం అన్నది గొప్ప విషయం. అందులోనూ ఇంత భారీ సినిమా, భారీ విఎఫ్ఎక్స్ పని వున్న సినిమా, లాస్ట్ మినిట్ సమస్యలు లేకుండా ఇంత త్వరగా సెన్సారు చేయించడం అంటే చెప్పుకోదగ్గ విషయమే.

సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. నిడివి రెండు గంటల 45 నిమిషాలు. సైరా లాంటి భారీ సినిమాకు ఈ నిడివి పెర్ ఫెక్ట్ అని చెప్పకోవాలి. ఇంత పెద్ద స్పాన్, ఇంత పెద్ద స్టార్ కాస్ట్ వున్న సినిమా మూడు గంటల వరకు వుండే అవకాశం వుంది. జనం కూడా తప్పుపట్టరు. కానీ అలాంటిది రెండు గంటల 45 నిమిషాలకు ముగించగలడం అంటే పెర్ ఫెక్ట్ ఎడిటింగ్ అనుకోవాలి.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి హేమా హేమీలు మెగాస్టార్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ

Show comments