సైరా కోసం రామ్ చరణ్

సైరా సినిమా విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. మరో వందరోజులు మాత్రమే సమయం వుంది. అంత భారీ సినిమాకు ప్రచారం ఓ పద్దతి ప్రకారం ముందుగా చేసుకుంటూ వెళ్లాలి. సాహో సినిమా మిస్ అయింది ఇక్కడే.రామ్ చరణ్ తన సైరా సినిమా కోసం మాత్రం ప్రచారం విషయంలో పక్కా ప్లాన్డ్ గా వెళ్తున్నాడు.

తొలిసారి ఇన్ స్టా గ్రామ్ లో అక్కౌంట్ తెరిచాడు. అతిత్వరలో సైరా గురించి ఓ మాంచి అప్ డేట్ దీని ద్వారా ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, సైరా గురించి వరుసగా అప్ డేట్ లు అన్నీ ఈ అక్కౌంట్ ద్వారానే ఇవ్వబోతున్నాడు.

ఇన్నాళ్లూ రామ్ చరణ్ తరపున అతని శ్రీమతి ఉపాసననే సోషల్ నెట్ వర్క్ లో యాక్టివ్ గా వుంటూ వస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ నేరుగా స్టార్ట్ చేసారు. సైరా సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రం. పైగా దీనికి నిర్మాత కూడా రామ్ చరణ్ నే. అందుకే ప్రచారం గురించి, మార్కెటింగ్ గురించి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పుడు కాపీ కొడితే అవతల వాళ్లు తేలికగా వదలరు