సైరా ఓవర్.. తరువాత సెట్ అక్కడే

సైరా.. మెగాస్టార్ మెగా మూవీ. ఆ సినిమా కోసం కోకాపేట్ లోని మెగా ఫ్యామిలీ స్వంత ప్లేస్ లో భారీ సెట్ వేసారు. ఇప్పుడు ఆ సినిమా అయిపోయింది. టాప్ డైరక్టర్ కొరటాల శివతో చిరు చేయబోయే 152వ సినిమా వ్యవహారం మొదలయింది. ఈ సినిమా కోసం ఇప్పుడు ఓ సెట్ అవసరం పడింది.

సినిమాలో హీరో ఇల్లు. అటు పెంకుటిల్లు కాదు, ఇటు మిద్దె ఇల్లు కాదు. కాస్త పెద్దగానే వుండే డిఫరెంట్ ఇల్లు. ఈ ఇంటిలోనే దాదాపు నలభై రోజులు షూట్ చేయాల్సి వుంటుంది. ఇలాంటి సెట్ స్వంత స్థలంలో వేసుకుంటే ఖర్చు కలిసి వస్తుంది.

అందుకే ఇప్పుడీ సెట్ ను సైరా సెట్ వేసిన కోకాపేట స్థలం వేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. సినిమాలో హీరో చిరంజీవి మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నారు. ఆయన ఇల్లు సెట్ ఇది. కాస్త ఎక్కువ ఖర్చుతోనే దీన్ని నిర్మించబోతున్నారు.

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

Show comments