సామి - పోలీస్ కాదు పోకిరి

డైరక్టర్ హరి మళ్లీ మరో సినిమా రెడీ చేసేసారు. ఈ నెల మూడో వారంలో రాబోతోంది స్వామి స్క్వేర్. డైరక్టర్ హరి అంటే మన జనాలకు సింగం సిరీస్ నే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు రాబోయే స్వామి 2 లేదా సామి  ట్రయిలర్ చూస్తుంటే మళ్లీ అదే సింగం సిరీస్ గుర్తుకు వస్తుంది. 

హరి స్టయిల్ రేసీ స్క్రీన్ ప్లే, చిత్రీకరణ, మాస్ ఎలిమెంట్స్, ఫైట్లు, తమిళ స్టయిల్ గుర్తుకు తెచ్చే పాటలు అన్నీ పక్కాగా, తూనికలు, కొలతలు అన్నీ చూసుకుని సినిమా తయారుచేసినట్లు కనిపిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ ను కూడా సినిమాకు ప్లస్ పాయింట్ చూపించాలనే ప్రయత్నం ట్రయిలర్ లో కనిపించింది.

గతంతో పోల్చుకుంటే విక్రమ్ ఈ సినిమాలో కాస్త బాగానే వున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గ్లామరస్ గా కనిపిస్తోంది. హరి సినిమాలకు ఓ సెట్ ఆఫ్ అభిమానులు వున్నారు. వారిని నిరాశ పర్చదు సినిమా అని తెలిపేలా వుంది ట్రయిలర్.