రాహుల్.. ఈ సస్పెన్స్ ఏం సాధించేందుకు?

'వారణాసి నుంచి ప్రియాంక వాద్రా పోటీ చేయబోతోందా?' అంటే సమాధానం చెప్పకుండా, 'సస్పెన్స్' అంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తన చెల్లెలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం గురించి రాహుల్ ఇలా స్పందిస్తున్నారు! వారణాసి నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక రెడీగానే ఉందని, అయితే రాహుల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..  ఆ విషయాన్ని తాము సస్పెన్స్ లో ఉంచినట్టుగా చెబుతున్నారు.

బహుశా అలా సస్పెన్స్ లో ఉంచడం ద్వారా బీజేపీని డైలమాలోకి నెట్టడమని రాహుల్ భావిస్తూ ఉండవచ్చు. ఒకవేళ ప్రియాంక వారణాసిలో తన మీద పోటీచేస్తే.. తను మరో సీటులో కూడా పోటీచేయాలని మోడీ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. సేఫ్ జోన్ కోసం మోడీ మరో ఎంపీ సీట్లో పోటీ అనే వార్తలు వస్తున్నాయి. బహుశా మోడీని అలా ఆలోచనలో పడేసేందుకు రాహుల్ ఈ 'సస్పెన్స్' అనే పదాన్ని ఉపయోగించి ఉండవచ్చు. అయితే.. ఈ సస్పెన్స్ ను పెట్టడం పెద్దకథ కాదు, దీన్ని సరిగా రీవిల్ చేయకపోతే అప్పుడు రాహుల్ కు ఇక్కట్లు తప్పవు!

ఇంత సస్పెన్స్ ను నడిపించి రేపు మోడీ మీద ప్రియాంక పోటీచేయలేదు అంటే.. అప్పుడు అది కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది అవుతుంది. 'భయపడ్డారు.. వెనక్కు తగ్గారు..'అనే మాటలు వినిపిస్తాయి. పోటీచేస్తే ఫర్వాలేదు. అమీతుమీ తేల్చుకున్నట్టుగా అవుతుంది. అయితే మోడీ మీద ప్రియాంకను పోటీ చేయించడం అంటే.. అది సరైన నిర్ణయం కాదనే మాటను కాంగ్రెస్ వాళ్లే చెబుతున్నారు.

ఈసారి ఎలాగూ పార్టీ పవర్ లోకి వచ్చేలాలేదు.. అలాంటప్పుడు ప్రియాంకను కూడా ఇప్పుడే పోటీ చేయించేస్తే పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందనే భావన ఉంది కాంగ్రెస్ నేతల్లో. అందుకే వాళ్లు ప్రియాంక పోటీవద్దని అంటున్నారట. అయితే రాహుల్ మాత్రం 'సస్పెన్స్' అంటున్నారు. సస్పెన్స్ ను సరిగా ముగించకపోతే  ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోతారు రాహుల్ జీ!

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?

Show comments