ఏ సినిమా చేసినా సక్సెస్ అవ్వలేదు, ఎన్ని గెటప్స్ వేసినా వర్కవుట్ కాలేదు. ఓ మంచి హిట్ కోసం మొహం వాచిపోయి ఉన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా సూర్యకు మరపురాని విజయాన్ని అందించింది.
ఓటీటీలో రిలీజైనప్పటికీ సూపర్ హిట్ అనిపించుకుంది. అలా ఎట్టకేలకు హిట్ కొట్టిన సూర్య, ఇప్పుడు బుల్లితెరపై కూడా తన సక్సెస్ ను కొనసాగించాడు.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సినిమాకు 6.77 టీఆర్పీ వచ్చింది. ఈమధ్య కాలంలో టీవీల్లో టెలికాస్ట్ అయిన సూర్య సినిమాల్లో ఇదే బెస్ట్ రేటింగ్.
ఇంతకుముందు అతడు నటించిన బందోబస్త్, ఎన్జీకే, గ్యాంగ్.. ఇలా ఏ సినిమా తీసుకున్నా ఈ స్థాయి రేటింగ్ రాలేదు.
సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కింది ఆకాశం నీ హద్దురా సినిమా. డెక్కన్ ఏయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్, ఆయన వ్యక్తిగత అంశాల ఆధారంగా తీసిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయింది.
ఇప్పుడు బుల్లితెరపై కూడా ఈ సినిమా హిట్టవ్వడం సూర్యకు కచ్చితంగా ఆనందాన్ని కలిగించే అంశం.