ఫైనల్ టచ్: ఏపీపై సర్వేల ఫలితాలు ఇవే

మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ రాత్రి గడిస్తే పోలింగ్ సందడి మొదలవుతుంది. పార్టీల భవితవ్యానికి సంబంధించి ఓటర్ తీర్పును ఇవ్వనున్నారు. ఫలితాలు అయితే ఇప్పుడే రావు కానీ.. ఫలితాలు ఎలా ఉండవచ్చనే అంశం గురించి సర్వేలు ఆసక్తిదాయకమైన విషయాలను చెబుతూ ఉన్నాయి. 

దేశంలోనే పేరున్న, ప్రముఖ, జాతీయ మీడియా సంస్థలు, స్వతంత్ర అధ్యయన సంస్థలు.. వెల్లడించిన సర్వే పలితాలు ఇవి. గత కొన్నాళ్లలో విడుదల అయిన ఈ సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో తిరుగులేదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

-టైమ్స్ నౌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20 ఎంపీ సీట్లు, తెలుగుదేశం పార్టీకి 5 ఎంపీ సీట్లు. ఓట్ల శాతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 43.7 శాతం ఓట్లు, తెలుగుదేశం పార్టీకి దక్కే ఓట్ల శాతం 35.10. 

-ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20 ఎంపీ సీట్లు, తెలుగుదేశానికి 5 ఎంపీ సీట్లు.

-రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 19 ఎంపీ సీట్లు, తెలుగుదేశానికి 6 ఎంపీ సీట్లు. ఓట్ల శాతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 41.3 శాతం ఓట్లు, తెలుగుదేశం పార్టీకి దక్కే ఓట్ల శాతం 33.1. 

-సీపీఎస్ సర్వే ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21 ఎంపీ సీట్లు, తెలుగుదేశానికి 4 ఎంపీ సీట్లు.

-ఎన్డీటీవీ సర్వే ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21 ఎంపీ సీట్లు, తెలుగుదేశానికి 4 ఎంపీ సీట్లు.

-అసెంబ్లీ సీట్ల వారీగా ఫలితాలను ప్రకటించిన సర్వేల్లో.. వీడీపీ అసోసియేట్స్ సర్వే ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 106 నుంచి 118 సీట్లు. ఓట్లశాతం 43.85, తెలుగుదేశం పార్టీకి 54 నుంచి 68 సీట్లు ఓట్ల శాతం 40. జనసేనకు ఒకటి నుంచి మూడు సీట్లు. ఓట్లశాతం 9.80. 

-హిందూ, తిరంగ టీవీ, సీఎస్డీఎస్ – లోక్ నీతి.. సర్వే ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 108 నుంచి 124 సీట్లు. ఓట్లశాతం 46, తెలుగుదేశానికి 41 నుంచి 57 సీట్లు ఓట్ల శాతం 36. ఇతరులకు ఐదు నుంచి పది సీట్లు. 

-సీపీఎస్ సర్వే ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 121నుంచి 130 సీట్లు. తెలుగుదేశం పార్టీకి 45 నుంచి 84 సీట్లు. ఓట్లశాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 48.1. తెలుగుదేశానికి 40.01. ఇతరులకు ఒకటి నుంచి రెండు సీట్లు ఓట్ల శాతం ఎనిమిది.

చివరికి పవన్ కల్యాణ్ కథ ఇదీ!

Show comments