తెలంగాణ: కాంగ్రెస్‌కు సర్వే షాక్!

ఒకవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్లో కాంగ్రెస్ కు సానుకూలత ఉందని వార్తలు వచ్చాయి. సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఈ మాటతో కాంగ్రెస్ హ్యాపీనే కానీ.. తాజాగా వచ్చిన కొన్ని ప్రీపోల్ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ కు ఝలక్ తప్పదని అంటున్నాయి. అలాగిలాగా కాదు.. భారీ స్థాయిలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగులుతుందని సర్వేలు చెబుతున్నాయి. రెండు మూడు ప్రముఖ సర్వేల ఫలితాలను కూడి, భాగించి చూడగా.. తెలంగాణలో తెరాస హవా ఉందని తేలుతోంది.

ఈ సర్వేలు ఇస్తున్న సమాచారం కోసం కేసీఆర్ మళ్లీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేలా ఫలితాలు రాబోతున్నాయి. తెరాస ఏకంగా ఎనభైకి పైగా స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వేలు చెబుతుండటం విశేషం. ఇంతకీ కాంగ్రెస్ వాటా ఎంత అంటే.. 20 సీట్లు అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ సీట్లను కోల్పోవడమే తప్ప పెంచుకోవడం ఏమీ ఉండదని ఈ సర్వేలు చెబుతున్నాయి.

ఎంఐఎం తనవంతు సీట్లను సొంతం చేసుకోగా.. తెలుగుదేశం మూడు నాలుగు సీట్లు అని అధ్యయనాలు చెబుతున్నాయి. బీజేపీది కూడా దాదాపు ఇదేస్థాయి. ఈ విధంగా రాజస్తాన్ లో కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్న సర్వేలే.. తెలంగాణలో తెరాసది విజయం అని అంటున్నాయి.

ఇక మధ్యప్రదేశ్ విషయంలో మొదట్లో కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు పట్టంకట్టగా తాజా సర్వేలు కొన్ని విజయం బీజేపీదే అని అంటుండటం గమనార్హం.

Show comments