‘యాత్ర’పై స్పందించిన డైరెక్టర్, స్టార్ హీరో!

ప్రతివారం విడుదల అయ్యే సినిమాలపై టాలీవుడ్ ప్రముఖులు ఏదో రకంగా స్పందిస్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి.. అది కూడా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేత గురించి సినిమా వస్తే.. టాలీవుడ్ జనాలు మాత్రం కామ్ గా ఉన్నారు. అందుకు కారణాలు ఏమిటో చెప్పనక్కర్లేదు.

సినిమా ఇండస్ట్రీ ఒక కులం చేతిలో బంధీ అయిపోవడంతో పాటు.. అధికారంలో ఉన్న వారిని తప్ప ఎవరినీ పట్టించుకోని తత్వం సినీ జనాలకు ఉండటం. ఇలా సినిమా వాళ్లు తమ తత్వాన్ని చాటుకొంటూ ఉన్నారు. టాలీవుడ్ జనాలు ఇలా వ్యవహరిస్తున్నా.. తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం ‘యాత్ర’ గురించి స్పందించాడు.

ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రను పోషించిన మమ్ముట్టీని ప్రశంసిస్తూ స్పందించాడు సూర్య. ఇక తెలుగు దర్శకుడు సురేందర్ రెడ్డి ‘యాత్ర’ సినిమా మీద స్పందించాడు. ఈ మేరకు ఒక ట్వీట్ పెట్టాడు సురేందర్ రెడ్డి. తను యాత్ర సినిమాను చూసినట్టుగా, ఈ సినిమా భావోద్వేగభరితం అని సురేందర్ రెడ్డి పేర్కొన్నాడు.