కర్ణాటక.. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలం?

అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలని అంటూ స్పీకర్ పై ఒత్తిడి తీసుకురాలేనట్టుగా కోర్టు తేల్చిచెప్పింది.
తద్వారా సంకీర్ణ సర్కారుకు సుప్రీంకోర్టు కొంత రిలీఫ్ ఇచ్చింది. అయితే ఎమ్మెల్యేలు తప్పకుండా శాసనసభకు హాజరై విశ్వాస తీర్మానంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని తాము ఆదేశించలేమని కూడా కోర్టు చెప్పింది. విశ్వాస తీర్మానానికి హాజరుకావడం కాకపోవడం వారి ఇష్టం అని కోర్టుతేల్చింది.

రాజీనామాల విషయంలో కాంగ్రెస్-జేడీఎస్ లకు ఊరటను ఇచ్చేలా ఉంది తీర్పు. అయితే ఎమ్మెల్యేల హాజరు వారి ఇష్టం అని కోర్టు తేల్చిచెప్పింది. దీంతో విశ్వాస తీర్మానానికి గైర్హాజరీ అయ్యి అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఎమ్మెల్యేకు దక్కింది. అయితే వారికి కాంగ్రెస్, జేడీఎస్ లు విప్ జారీ చేయవచ్చు. విప్ ను ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు కూడా వేయచ్చు.

విశ్వాస పరీక్ష అనంతరం సంకీర్ణ సర్కారు కుప్పకూలకుండా ఉంటే అప్పుడు ఏదైనా చేయవచ్చు. కానీ అసంతృప్త ఎమ్మెల్యేల నంబర్ ను మైనస్ చేస్తే కుమారస్వామి సర్కారు కూలిపోవడం ఖాయం. విశ్వాస పరీక్షకు వారు గైర్హాజరు అయినా, అంతలోపే వారిపై అనర్హత వేటు వేసినా.. కుమారస్వామి ప్రభుత్వం నిలబడటం మాత్రం జరిగేలా లేదని పరిశీలకులు అంటున్నారు.

గురువారం కర్ణాటక శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనబోతోంది కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు. 

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం

Show comments