అరెరె.. నిజంగానే సన్నీలియోన్ వచ్చేస్తోంది!

ప్రకాష్ రాజ్: నీకు సన్నీలియోన్ ను గిఫ్ట్ గా ఇస్తున్నాను
ఎన్టీఆర్: ఏంటి.. సన్నీలియోన్ వైజాగ్ లో ఉందా..!
ఎన్టీఆర్: ఇది సన్నీలియోన్ కాదెహే..
ప్రకాష్ రాజ్: మా వైజాగ్ కి ఇదే సన్నీలియోన్ రోయ్..

టెంపర్ సినిమాలో ఇలా సన్నీలియోన్ పేరును విచ్చలవిడిగా వాడేసుకున్నారు. ఆమెతో ఐటెంసాంగ్ లేకపోయినా ఆ విధంగా 2 డైలాగ్స్ తో కవర్ చేశారు. కానీ టెంపర్ తమిళ రీమేక్ లో మాత్రం ఇలా ఊహించడాల్లేవ్. డైలాగ్స్ తో కవర్ చేయడాలు అస్సల్లేవు. డైరక్ట్ గా సన్నీ లియోన్ నే రంగంలోకి దించారు.

అవును.. విశాల్ హీరోగా నటిస్తున్న టెంపర్ తమిళ రీమేక్ లో నేరుగా సన్నీలియోన్ తోనే ఐటెంసాంగ్ పెట్టారు. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ ఒక్క సాంగ్ కోసం సన్నీకి గట్టిగానే సమర్పించుకున్నారు.

బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఇప్పుడు భాషతో సంబంధం లేదు. ఏ సినిమా అయినా, అందులో పాత్ర ఏదైనా, ఐటెంసాంగ్ అయినా డేట్స్ ఇచ్చేస్తుంది. కాకపోతే ఆమె చూసేది ఒకటే. తను డిమాండ్ చేస్తున్నంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా లేదా అనేదే సన్నీకి ఇంపార్టెంట్. విశాల్ అండ్ కో ఒప్పుకున్నారు కాబట్టి టెంపర్ తమిళ రీమేక్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments