సీక్రెట్ చెప్పేసి సిల్లీ ఫెలో అనిపించుకున్న సునీల్

ఓ సినిమాకు రీమేక్ వస్తోందంటే, వెంటనే దాని డబ్బింగ్ ఆపేస్తారు. కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి రీమేక్ చేస్తుంటారు. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కానీ సిల్లీ ఫెలోస్ సినిమా విషయంలో మాత్రం అంతా రివర్స్. తమిళ్ లో విడుదలైన ఈ మూవీ, ఆల్రెడీ తెలుగులోకి కూడా డబ్ అయింది. అంటే ఎంతో కొంతమంది తెలుగు ప్రేక్షకులు చూసేసిన సినిమానే. ఇప్పుడా సినిమానే మళ్లీ ఫ్రెష్ గా రీమేక్ అయింది. అదే సిల్లీ ఫెలోస్.

తమిళ్ లో గతేడాది వైళైను వందాత్తు వెళ్లైకారన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమానే కొన్నాళ్లకు తెలుగులో ప్రేమలీల-పెళ్లిగోల పేరుతో విడుదలైంది. తెలుగులో అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడిదే సినిమా సరికొత్త స్టార్ కాస్ట్ తో సిల్లీఫెలోస్ పేరుతో మళ్లీ వస్తోంది. అల్లరినరేష్, సునీల్ హీరోలు. 

మొన్నటివరకు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టింది యూనిట్. కానీ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ చప్పున బయటపెట్టేశాడు సునీల్. విషయం తెలుసుకొని నాలుక కరుచుకున్న ఈ నటుడు వెంటనే ఆ మేటర్ ను కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. మూవీ రీమేక్ అయినప్పటికీ క్లయిమాక్స్ పూర్తిగా మార్చామని, మరీ ముఖ్యంగా ఆఖరి అర్థగంట పూర్తిగా కొత్తగా ఉంటుందని అంటున్నాడు.

ఈ సినిమాలో అల్లరినరేష్ పాత్ర కంటే సునీల్ క్యారెక్టరే బాగుంటుంది. ప్రేమలీల పెళ్లిగోల లేదా తమిళ వెర్షన్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. మొత్తమ్మీద చెప్పకూడని విషయాన్ని రిలీజ్ కు ముందే చెప్పి నిజంగానే సిల్లీ ఫెలో అనిపించుకున్నాడు సునీల్. 

RELATED చంద్ర పోటు: నొప్పి తెలిసిందా పవన్‌.?